Advertisement

  • ఈఎస్‌ఐ ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న రోగి

ఈఎస్‌ఐ ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న రోగి

By: Sankar Fri, 06 Nov 2020 08:56 AM

ఈఎస్‌ఐ ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న రోగి


సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ దవాఖాన మూడో అంతస్థు పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఐడీపీఎల్‌ కాలనీకి చెందిన శేఖర్‌(37) జ్వరం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురికావటంతో రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులు సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ దవాఖానలో చేర్పించారు.

వైద్య పరీక్షల అనంతరం శేఖర్‌కు రక్తకణాలు తక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తులు పాడైనట్లు స్థానికంగా వైద్యులు చెప్పడంతో దవాఖానలో చేర్పించామని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా దవాఖానా భవనంలోని నాలుగో అంతస్థులో చికిత్స పొందుతున్న శేఖర్‌ గురువారం మధ్యాహ్నం దవాఖాన మూడో అంతస్థుకు చేరుకుని అక్కడ ఉన్న కిటికీ అద్దాలను పగులగొట్టి కిందకు దూకాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని అక్కడే అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందించగా... కొద్దిసేపటికే మృతి చెందాడు.

అయితే వైద్యులు సరైన చికిత్స అందించకపోవడం వల్లే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని శేఖర్‌ తల్లి సుక్కమ్మ ఆరోపించింది. ఈ సంఘటనపై దవాఖాన డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శైలజ వాణి మాట్లాడుతూ దవాఖాన భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన శేఖర్‌కు వైద్యులు సరైన చికిత్స అందించారన్నారు...

Tags :
|

Advertisement