Advertisement

  • నేను రాణిస్తే ధోని కంటే నాకే టీంలో అవకాశం దక్కేది ..పార్థివ్ పటేల్

నేను రాణిస్తే ధోని కంటే నాకే టీంలో అవకాశం దక్కేది ..పార్థివ్ పటేల్

By: Sankar Mon, 29 June 2020 10:28 AM

నేను రాణిస్తే ధోని కంటే నాకే టీంలో అవకాశం దక్కేది ..పార్థివ్ పటేల్


ధోని ..ఇండియన్ క్రికెట్లో వికెట్ కీపర్ అంటే గత పదిహేను సంవత్సరాలలో వినిపించిన ఒకేఒక్క పేరు ..అంతకుముందు ఇండియన్ క్రికెట్లో పెర్మనెంట్ కీపర్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండకపోయేవాళ్లు ..కీపర్ అంటే కేవలం కీపింగ్ మాత్రం చేస్తే చాలు అనే భావనను ధోని బద్దలుకొట్టాడు ..ధోని రాకతో ఇండియన్ క్రికెట్లో మరొక కీపర్ కోసం అవసరం లేనంత స్థాయిలో రాణించాడు..అయితే ధోని కంటే ముందే టీంలోకి వచ్చిన పార్థివ్ పటేల్ , దినేష్ కార్తీక్ లు ధోని టీంలోకి వచ్చాక కనుమరుగయిపోయారు ..వీళ్లిద్దరి కాకా చాల మంది కీపర్లు ధోని ఉండటంతో ఇండియన్ టీంలో స్థానం పొందలేకపోయారు ..అయితే దీనికి ధోనిని తప్పు పట్టడం తగదు అని అన్నాడు పార్థివ్ పటేల్ ..మేము రాణిస్తే మాకే చోటు దక్కేది అని అన్నాడు ..

భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పార్థీవ్ పటేల్.. తన కెరీర్ ఇలా గాడి తప్పడానికి కారణం స్వయంకృపరాధమేనని అంగీకరించాడు. అప్పట్లో తాను బాగా ఆడింటే..? టీమిండియా మేనేజ్‌మెంట్ తనకే అవకాశాలిచ్చేదని చెప్పుకొచ్చిన పార్థీవ్.. తాను ఫెయిలవడంతోనే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించి ధోనీకి అవకాశమిచ్చిందని గుర్తు చేసుకున్నాడు.

చాలా మంది ఇప్పటికీ చెప్తుంటారు.. ధోనీ శకంలో పుట్టడమే నా తప్పు అని. కానీ.. ధోనీ కారణంగా నా కెరీర్ తొందరగా ముగిసిపోయిందని చెప్పి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. అది ఏంటంటే..? నా ప్రదర్శన అప్పట్లో బాగాలేదు. కాబట్టే.. వేరొకరికి నా స్థానంలో కీపర్‌గా అవకాశం దక్కింది. వాస్తవానికి ధోనీ కంటే ముందు నా స్థానంలో దినేశ్ కార్తీక్‌కి ఛాన్స్ లభించింది. ఆ తర్వాతే ధోనీ వచ్చాడు. ఒకవేళ నేను నిలకడగా రాణించి ఉంటే..? ఎవరూ నా స్థానంలోకి వచ్చే వారు కాదు. ధోనీ శకంలో పుట్టి.. ఎక్కువ రోజులు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవడంపై ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు అని అన్నాడు

Tags :
|

Advertisement