Advertisement

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

By: Sankar Wed, 02 Sept 2020 12:26 PM

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..


ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ సభలు రెండు షిఫ్తుల్లో పని చేయనున్నాయి. లోక్ సభ మొదటిరోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు, ఆ తరువాత అక్టోబరు వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలవరకు ఉంటుంది.

ఇక మిగతా రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు నిర్వహిస్తారు. మరోవైపు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. దాంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయవద్దంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వీకెండ్ డేస్ కూడా ఉండవు. అరగంటసేపు జీరో అవర్ ఉంటుంది.

కాగా కరోనా మహమ్మారి ఇండియాలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో పార్లమెంట్ సమావేశాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు..ప్రతిపక్షాలు కూడా ఈ సమావేశాలలో ప్రభుత్వం మీద కరోనా విషయంలో ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది..

Tags :

Advertisement