Advertisement

ఉద్యానవనాలలోని ప్రకృతి అందాలు

By: chandrasekar Sat, 06 June 2020 7:25 PM

ఉద్యానవనాలలోని ప్రకృతి అందాలు


హైదరాబాద్‌లో అనేక పార్కులు జీవ వైవిధ్యంతో ఉద్యానవనాలలోని ప్రకృతి అందాలను ప్రసాదిస్తున్నాయి. నగరంలో ఏ చోటకెళ్లినా బాగ్‌ పేరుతో ఓ ప్రాంతం కనిపిస్తుంది. సీతారాంబాగ్‌, బాగ్‌ అంబర్‌పేట, బాగ్‌ లింగంపల్లి, బాగ్‌ అయామ్‌, కంచన్‌బాగ్‌, జాంబాగ్‌, బషీర్‌బాగ్‌, పూల్‌బాగ్‌, కిషన్‌బాగ్‌, కుందన్‌బాగ్‌, జ్ఞాన్‌బాగ్‌ ప్రాంతాలు అలానే ఏర్పడ్డాయి. మనం తినే ఆహారం పీల్చేగాలి తాగేనీరు సమస్తం ప్రకృతి మయమే. ప్రకృతితోనే మానవ మనుగడ. పర్యావరణం గొప్పతనాన్ని గుర్తు చేసుకునే రోజు నేడు . ఈ ఏడాది టైమ్‌ ఫర్‌ నేచర్‌ థీమ్‌తో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. మన భాగ్యనగరంలోనూ పచ్చని అందాలకు కొదవలేదు. ఒకప్పుడు పూదోటల నగరంగా పిలిచేవారు. ప్రస్తుత ఆధునిక కాలంలోనూ హైదరాబాద్‌లో అనేక పార్కులు జీవ వైవిధ్యంతో అలరారుతున్నాయి. ప్రకృతిరమణీయతను పంచుతున్నాయి. నగరవాసులకు కావాల్సిన ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.

* ప్రకృతిరమణీయ ఉద్యానవనాలు

జూపార్కు, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం, జలగం వెంగళరావు పార్కు. సుందరయ్య పార్కు, సంజీవయ్య పార్కు, బొటానికల్‌ గార్డెన్స్‌, ఇందిరాపార్కు, నారపల్లి భాగ్యనగర నందనవనం, కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు, లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, దక్కన్‌, కృష్ణకాంత్‌, చాచా నెహ్రూ పార్కు.

parks,that,have,natural,beauty ,ఉద్యానవనాలలోని, ప్రకృతి, అందాలు, హైదరాబాద్‌లో, నగరంలో


* జీవ వైవిధ్య వనాలుగా విశ్వవిద్యాలయాలు

నగరంలోని పలు విశ్వవిద్యాలయాలప్రాంగణాలన్నీ జీవ వైవిధ్యానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ ప్రాంగణాలు అటవీ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. విశ్వవిద్యాలయమంటే ఓ వికాస కేంద్రంగా పరిఢవిల్లడమే కాకుండా ప్రకృతిని పరిచయం చేసే ప్రయోగశాలలుగా భాసిల్లుతున్నాయి. పచ్చిక బయళ్లు, చెట్లు, పక్షులు, జీవాల సమూహాలను మన ముందుకు తెస్తున్నాయి.

* కాలుష్య నివారణలో పచ్చదనం

నగరంలో పచ్చదనం అధికంగా ఉన్న ఏరియాలు, మైదాన ప్రాంతాలు ఉన్నచోట్లలో ఉష్ణోగ్రతలు, కాలుష్యంలో భారీ తేడాలుంటున్నాయి. నెక్లెస్‌రోడ్‌లో ఎన్టీఆర్‌ పార్కు, నెహ్రూ జూ పార్కు, కేబీఆర్‌ పార్కు వద్ద వృక్షాలు అధికంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు, కాలుష్యం శాతం తక్కువగా నమోదవుతున్నవి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైతం వనాలు, చెట్లు ఉండటం వల్ల అక్కడ చల్లటి వాతావరణం ఉంటున్నది. ఇక పూర్తిగా కాంక్రీట్‌ జంగిల్‌గా ఉన్న ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Tags :
|
|
|

Advertisement