Advertisement

  • రాహుల్ , పంత్ లలో అతడికే టీమిండియా ఫుల్ సపోర్ట్ ..బ్యాటింగ్ కోచ్

రాహుల్ , పంత్ లలో అతడికే టీమిండియా ఫుల్ సపోర్ట్ ..బ్యాటింగ్ కోచ్

By: Sankar Sun, 28 June 2020 6:48 PM

రాహుల్ , పంత్ లలో అతడికే టీమిండియా ఫుల్ సపోర్ట్ ..బ్యాటింగ్ కోచ్



ఇండియన్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు ..కీపర్ గా ధోని సాధించిన ఘనతలు అసామాన్యం ..అయితే ధోని రిటైర్మెంట్కు దగ్గర పడటంతో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం టీమిండియా ఎదురు చూస్తుంది ..రిషబ్ పంత్ , రాహుల్ లను ప్రయత్నించింది ..పంత్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమవగా.. కేఎల్ రాహుల్ ఎవరూ ఊహించనిరీతిలో క్లిక్ అయ్యాడు. కానీ.. రాహుల్‌తో పోలిస్తే రిషబ్ పంత్‌కే టీమిండియా మేనేజ్‌మెంట్ ఎక్కువ సపోర్ట్ ఇస్తోందని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

రిషబ్ పంత్ గత ఏడాది గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు. అయినప్పటికీ.. టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి సపోర్ట్‌గా నిలుస్తోంది. దానికి కారణం పంత్ స్పెషల్ ప్లేయర్ అని నమ్మడమే. ఒక్కసారి అతను టచ్‌లోకి వస్తే.. ఆ తర్వాత నిలకడగా పరుగులు రాబట్టగలడు. ఇక జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. దానికితోడు వరుస ఫెయిల్యూర్స్ కారణంగా రిషబ్ పంత్ ఒత్తిడిలో ఉన్నాడు. కానీ.. ఇలాంటి ఎదురుదెబ్బలే అతడ్ని మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దుతాయి అని విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.

Tags :

Advertisement