Advertisement

  • భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి

భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి

By: Sankar Tue, 06 Oct 2020 4:41 PM

భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి


ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన విషయమైన కృష్ణబిలంపై పరిశోధనలు నిర్వహించినందుకు గానూ శాస్త్రవేత్తలు రోజర్‌ పెన్రోస్‌, రిన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా గెజ్‌లకు నోబెల్‌ పురస్కారం ప్రకటించారు.

అయితే, బహుమతి 9.14 లక్షల అమెరికన్ డాలర్లు లేదా రూ.6.5 కోట్లలో సగం పురస్కారాన్ని రోజర్‌ పెన్రోస్‌కు ఇవ్వగా.. మిగతా సగాన్ని రిన్‌హార్డ్‌, ఆండ్రియాలు పంచుకోనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ గ్రహీతలను మంగళవారం ప్రకటించారు.

సంబంధిత రంగాలలో పనిచేసిన పలువురు శాస్త్రవేత్తలు బహుమతిని పంచుకోవడం సర్వసాధారణం.గత సంవత్సరం సౌర వ్యవస్థ వెలుపల ఒక గ్రహాన్ని కనుగొన్నందుకు స్విస్ ఖగోళ శాస్త్రవేత్తలు మైఖేల్ మేయర్, డిడియర్ క్యూలోజ్ నోబెల్ బహుమతి వరించింది.

Tags :
|

Advertisement