Advertisement

  • ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఆన్‌లైన్‌ చేయని ఇండ్ల వివరాలను ప్రత్యేక రికార్డుల్లోకి ఎక్కించాలన్న పంచాయతీరాజ్‌శాఖ

ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఆన్‌లైన్‌ చేయని ఇండ్ల వివరాలను ప్రత్యేక రికార్డుల్లోకి ఎక్కించాలన్న పంచాయతీరాజ్‌శాఖ

By: chandrasekar Fri, 16 Oct 2020 2:25 PM

ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఆన్‌లైన్‌ చేయని ఇండ్ల వివరాలను ప్రత్యేక రికార్డుల్లోకి ఎక్కించాలన్న పంచాయతీరాజ్‌శాఖ


ప్రస్తుతం ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ తెలంగాణాలో తీవ్ర వేగంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యాజమాని చనిపోయినా లేక ఇతరులకు విక్రయించినా (పేరు మార్పిడి జరుగకుంటే) ఆ ఇంటిని ఆన్‌లైన్‌ చేయొద్దని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇలా ఆన్‌లైన్‌ చేయని ఇండ్ల వివరాలను ప్రత్యేక రికార్డుల్లోకి ఎక్కించాలంటూ అన్ని జిల్లాల అధికారులను పంచాయతీరాజ్‌శాఖ ఆదేశించింది. ఈ మేరకు గురువారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు డీపీవోలకు దిశానిర్దేశంచేశారు. ఏ కారణంతో ఇండ్లను ఆన్‌లైన్‌చేయలేదో రికార్డులో నమోదుచేసి, వాటిని ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టంచేశారు.

ఇక గ్రామాల విషయానికి వస్తే ఆన్‌లైన్‌ ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసుకున్న గ్రామాలు ఎన్ని ఇండ్లను నమోదుచేయలేదు, ఎందుకుచేయలేదు అనే వివరాలను నాలుగు రోజుల్లో రికార్డుచేసి పెట్టుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో 61.55 శాతం ఆస్తులను నమోదుచేశారు. పట్టణాల్లో మొత్తం 20.76 లక్షల ఆస్తులుండగా గురువారం సాయంత్రంనాటికి 12.78 లక్షలు ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. మిగిలినవాటిని 20వ తేదీలోగా పూర్తిచేయనున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి పట్టణంలో అత్యధికంగా 99.11 శాతం, అన్నింటికంటే తక్కువగా వరంగల్‌ అర్బన్‌ పట్టణంలో 38.24 శాతం ఆస్తులను ఆన్‌లైన్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో 76.59 శాతం పూర్తయ్యింది.

వ్యవసాయేతర ఆస్తుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా 62.68 లక్షల ఇండ్లు ఉండగా, ఇప్పటివరకు 48 లక్షల ఇండ్లను ఆన్‌లైన్‌చేశారు. కార్యదర్శులు గ్రామాల్లోనే ఉంటూ నిత్యం 4 లక్షల ఇండ్లను టీఎస్‌ఎన్‌పీబీ యాప్‌లో నమోదుచేస్తున్నారు. మరో మూడురోజుల్లో ఇండ్ల నమోదు మొత్తం పూర్తవుతుందని ఆ వెంటనే పంచాయతీ కార్యాలయాల్లో ఆస్తుల జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ చేపట్టి దసరాలోగా ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెబుతున్నారు. ప్రతి రెండ్రోజులకు ఒకసారి జిల్లా అధికారులతో సమీక్షిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని పంచాయతీరాజ్‌ కమిషన ర్‌ రఘునందన్‌రావు తెలిపారు. ఇప్పటివరకు వనపర్తి జిల్లా టాప్‌లో కొనసాగగా, బుధవారం కామారెడ్డి, జగిత్యాల జిల్లాలు వనపర్తిని దాటేశాయి. దీనిపై అధికారులు ఆన్ లైన్ నమోదు పై వేగంగా పనిచేస్తున్నారు.

Tags :

Advertisement