Advertisement

  • రోహిత్ ఏ బౌలర్ ను అయినా దైర్యంగా ఎదుర్కోగలడు ..అతడి వికెట్ నా చిరకాల కోరిక ..పాక్ యువ పేసర్

రోహిత్ ఏ బౌలర్ ను అయినా దైర్యంగా ఎదుర్కోగలడు ..అతడి వికెట్ నా చిరకాల కోరిక ..పాక్ యువ పేసర్

By: Sankar Fri, 17 July 2020 9:42 PM

రోహిత్ ఏ బౌలర్ ను అయినా దైర్యంగా ఎదుర్కోగలడు ..అతడి వికెట్ నా చిరకాల కోరిక ..పాక్ యువ పేసర్



రోహిత్ శర్మ ప్రస్తుత క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు ..ముఖ్యంగా వన్ డే ఫార్మాట్లో కోహ్లీతో పాటు దూసుకుపోతూ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నాడు .అయితే ఈ భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీయాలని తనకు ఎప్పటి నుంచో కోరిక అని పాకిస్థాన్ యువ బౌలర్ నసీం షా చెబుతున్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్లను తీయాలని అనుకుంటున్నానని, వారి ముగ్గురి వికెట్లు తన డ్రీమ్ హ్యాట్రీక్ అని తెలిపాడు. అయితే వీరు ముగ్గురిలో రోహిత్ శర్మ ఎంతో ప్రత్యేకమని, అతడి వికెట్ తీయడం తనకెంతో ప్రత్యేకమని నసీం షా వివరించాడు.

రోహిత్ గొప్ప బ్యాట్స్‌మన్. అన్ని రకాల షాట్లను సునాయాసంగా ఆడే సత్తా రోహిత్‌లో ఉంది. ఏ బౌలర్‌నైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. అందుకే రోహిత్ వికెట్ తీయాలని నా కోరిక’ అని నసీం షా పేర్కొన్నాడు. అదేవిధంగా స్టీవ్ స్మిత్‌ విభిన్నమైన శైలిగల ఆటగాడని చెప్పాడు. ఇదిలా ఉంటే ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జో రూట్‌ను ఔట్ చేసే అవకాశం మాత్రం నసీం షాకు దక్కనుంది. ఒకవేళ ఆ వికెట్ దక్కితే తన డ్రీమ్ హ్యాట్రిక్‌లో ఓ వికెట్ దక్కినట్లే.




Tags :
|
|
|
|
|

Advertisement