Advertisement

  • మ్యాచ్ మధ్యలో శునకం రావడంతో ఆగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌

మ్యాచ్ మధ్యలో శునకం రావడంతో ఆగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌

By: chandrasekar Mon, 16 Nov 2020 8:31 PM

మ్యాచ్ మధ్యలో శునకం రావడంతో ఆగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌


మన దేశంలో ఐపీఎల్ జరిపినట్లే పాకిస్థాన్ లో పీఎస్‌ఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఈ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌లో అనుకొని అతిథి గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య జరగుతున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్ సూపర్ ఓవర్‌‌కు దారితీసింది. చివరకి ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతున్న ఈ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఇక్కడ కరాచీ కింగ్స్ ఇన్నింగ్స్ 14 ఓవర్ లో మ్యాచ్ ఆగిపోయింది. ఓ శునకం మ్యాచ్ జరుగుతుండగా మైదానం మధ్యలోకి వచ్చి అక్కడే కూర్చుండి పోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ గురైనా గ్రౌండ్ సిబ్బంది దానిని వెంటనే మైదానం నుంచి బయటకు పంపించారు. కెమెరాలు కూడా మైదానంలోకి వచ్చిన ఆ అతిథిని పదేపదే చూపిస్తూ అభిమానులను నవ్వుకూనేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెుదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది.

ఇందులో రవి బోపారా(40), సోహైల్ తన్వీర్(21) హిటింగ్‌తో కరాచీ కింగ్స్ ముందు లక్ష్యాన్ని ఉంచింది ముల్తాన్ సుల్తాన్. అనంతరం ఛేదనను అరంబించిన కరాచీ కింగ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌ వరకు వెళ్ళింది. ఇక సూపర్ ఓవర్‌లో కరాచీ కింగ్స్ 13 రన్స్ చేసింది. తర్వాత ముల్తాన్ సుల్తాన్ 9 పరుగులే చేసి ఓటమి చెందింది. కరోనా, ఐపీఎల్ కారణంగా కొద్ది రోజులు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు విరామం లభించింది. శనివారం మళ్లీ పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. కానీ ఇక్కడ మ్యాచ్లు లు మన ఐపీఎల్ లాగా ప్రఖ్యాతి గాంచలేదు.

Tags :
|

Advertisement