Advertisement

  • క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన పాక్ స్టార్ బౌలర్

క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన పాక్ స్టార్ బౌలర్

By: Sankar Sun, 18 Oct 2020 07:31 AM

క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన పాక్ స్టార్ బౌలర్


పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ ఈ రోజు అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు 13 సంవత్సరాల పాటు కొనసాగిన తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. తన కెరీర్ లో పాకిస్థాన్ జట్టుకు గుల్ ఎన్నో మ్యాచ్ లలో విజయాలను అందించాడు..ముఖ్యంగా టి ట్వంటీ లలో నమ్మదగిన బౌలర్ గా ఎదిగిన గుల్ ఇటీవల జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు

కాగా గుల్ 2003 ఏప్రిల్‌లో షార్జాలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేశాడు. అప్పటినుండి పాక్ తరపున మొత్తం 47 టెస్టులు, 130 వన్డేలు 60 టీ20 లు ఆడిన గుల్ 2016 జనవరిలో న్యూజిలాండ్ తో తన చివరి టీ 20 మ్యాచ్ ఆడాడు. ఉమర్ గుల్ టెస్టుల్లో మొత్తం 163 ​​వికెట్లు పడగొట్టగా, వన్డేలో 179 వికెట్లు, టీ 20 ల్లో 85 వికెట్లు సాధించాడు.

36 ఏళ్ళ గుల్ తన వీడ్కోలు సమయంలో '' నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నా క్రికెట్ ప్రయాణాన్ని నేను బాగా ఆస్వాదించాను. అయితే ఈ ప్రయాణంలో నాకు తోడుగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే నా అభిమానులందరికి ధన్యవాదాలు'' అని తెలిపాడు.

Tags :

Advertisement