Advertisement

మళ్ళీ గ్రే లిస్ట్ లో చేరిన పాకిస్తాన్...

By: Sankar Fri, 23 Oct 2020 10:29 PM

మళ్ళీ గ్రే లిస్ట్ లో చేరిన పాకిస్తాన్...


ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ మరోసారి షాకిచ్చింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయటంలో విఫలమైన పాకిస్థాన్‌ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మనీ లాండరింగ్‌, ఉగ్రవాద నిర్మూలన, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయటం వంటి 27 లక్ష్యాలను పాక్‌కు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించగా, వాటిల్లో ఆరు అంశాల్లో పాక్‌ విఫలమైందని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో ఉన్న 4వేల మంది ఉగ్రవాదులపై పాక్‌ ప్రభుత్వం ప్రయాణ షరతులను ఎత్తేయటం కూడా ఆ దేశంపై నమ్మకం కోల్పోయేలా చేసింది.

పాక్‌ గ్రే లిస్టులో ఉన్నందుకే ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందడం కష్టంగా మారింది. పాక్‌తో పాటు ఉత్తర కొరియా, ఇరాన్‌లు బ్లాక్‌లిస్టులో ఉన్నాయ్‌.

Tags :

Advertisement