Advertisement

  • కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ..హెచ్చరించిన భారత్

కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ..హెచ్చరించిన భారత్

By: Sankar Mon, 02 Nov 2020 10:25 AM

కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ..హెచ్చరించిన భారత్


అవకాశం దొరికితే చాలు.. భారత్‌ను ఎప్పుడూ రెచ్చగొట్టాలని చూస్తూనే ఉంటుంది పాక్.. ఇప్పుడు మరో దుస్సాహసానికి తెగబడింది... భారత్‌-పాకిస్థాన్‌ మధ్య వివాదాస్పద ప్రాంతమైన... గిల్గిత్‌-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రాంతీయ హోదా ప్రకటించింది పాక్‌. చైనాను ప్రసన్నం చేసుకోడానికి భారీ నిరసనల మధ్య ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. పాకిస్థాన్‌ మ్యాప్‌ నుంచి పీవోకేతో పాటు గిల్గిత్, బాల్టిస్తాన్లను సౌదీ అరేబియా తొలగించింది.

తమ ప్రత్యేక కరెన్సీ నోటు పైనుంచి వీటిని తొలగించిన తరువాత తాత్కాలిక ప్రాంతీయ హోదా ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చింది. గిల్గిత్-బాల్టిస్థాన్ భారతదేశానికి పూర్తి హక్కు ఉంది. దీనిని ప్రావిన్స్‌గా మార్చడం లేదనేది భారత్‌ వాదన. అది ఎప్పటికీ భారత్‌ భూభాగంగానే ఉంటుంది. పాకిస్థాన్‌కు దానిపై ఎలాంటి హక్కు లేదంటోంది. భారత్‌ను రెచ్చగొట్టడానికే పాకిస్థాన్‌ ఈ చర్యకు పూనుకున్నట్టు స్పష్టమవుతోంది.

కాగా అవిభాజ్య కశ్మీర్‌లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్‌ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అధికారం పాక్‌ ప్రభుత్వానికి లేదని భారత్‌ వాదిస్తోంది. ఈ మేరకు దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్‌ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ ప్రాంతానికి ప్రొవెన్షియల్‌ హోదా కల్పించేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించారు. హోదా మార్చడమే కాకుండా.. ఆక్రమిత ప్రాంతం (పీవోకే) నుంచి తక్షణమే వెళ్లిపోవాలని ప్రకటించారు

Tags :

Advertisement