Advertisement

  • కరోనా వైరస్ నుండి బయటపడ్డ పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌

కరోనా వైరస్ నుండి బయటపడ్డ పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌

By: chandrasekar Fri, 31 July 2020 09:56 AM

కరోనా వైరస్ నుండి బయటపడ్డ పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌


కరోనా వైరస్‌తో నెలరోజులుగా పడుతున్న ఇబ్బందుల నుంచి పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. తాజాగా అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ ఫలితం వచ్చింది. దీంతో స్పీడ్‌స్టర్‌ ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు లైన్‌క్లియర్‌ అయింది.

ఇప్పటికే పాక్‌ జట్టు మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ టూర్‌ కోసం పాక్‌ 29 మంది ఆటగాళ్లతో బృందాన్ని ఎంపిక చేసింది. ఐతే హారిస్‌కు ఐదుసార్లు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతడు స్వదేశానికి పరిమితమైనాడు.

ఇప్పటికే హరీస్‌కు ఒకసారి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం వరుసగా రెండుసార్లు నెగెటివ్‌ వస్తేనే హారిస్‌ రౌఫ్‌ పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారణ. అప్పుడు మాత్రమే అతడు ఇంగ్లాండ్‌లోని తన జట్టుతో కలిసే అవకాశం ఉంటుంది. 26ఏండ్ల హారీస్‌కు కోవిడ్‌-19 లక్షణాల నుండి బయట పడటం సంతోషించదగ్గ విషయం.

Tags :
|

Advertisement