Advertisement

పొరుగున ఉన్న చైనాతో పాకిస్తాన్ కూడా ఇబ్బంది

By: chandrasekar Sat, 27 June 2020 2:47 PM

పొరుగున ఉన్న చైనాతో పాకిస్తాన్ కూడా ఇబ్బంది


చైనీస్ కంపెనీలు చేసిన పనికి ఆ దేశ ఖజానాపై భారీగా చిల్లు పడనుంది. దీంతో చైనీస్ కంపెనీలతో బేరసారాలు మొదలు పెట్టింది. పాకిస్తాన్‌లో రోడ్డు, రైలు మార్గాలను నిర్మిస్తున్నా చైనీస్ కంపెనీలు. అక్కడి కోల్ మైన్ హువాంగ్ షాండాంగ్ రూయీ (పాకిస్తాన్) ఎనర్జీ, పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలు నిర్మిస్తున్న ప్రాజెక్టులో పాకిస్తాన్ నుంచి సెటప్, వడ్డీల రూపేణా సుమారు 3 బిలియన్ డాలర్ల రూపాయలను అధికంగా వసూలు చేస్తున్నాయి.

ఈ కంపెనీలో ఏదో గోల్ మాల్ జరుగుతోందని భావించిన ఇస్లామాబాద్ దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి చైనీస్ కంపెనీలు పాకిస్తాన్ ఖజానాకు పెద్ద చిల్లు పెట్టేలా ఉన్నాయని, తప్పుడు సమాచారంతో ప్రాజెక్టు ఖర్చును భారీ ఎత్తున పెంచేస్తున్నాయని, దీని వల్ల తమ దేశం అధికమొత్తం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ విషయం మెల్లగా చైనకు కూడా తెలిసింది. దీంతో బీజింగ్ చేస్తున్న ఒత్తిడి కారణంగా ఆయా కంపెనీతో బ్యాక్ డోర్‌లో చర్చలు మొదలు పెట్టినట్టు ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ ఆదాయం భారీగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుందో, ఎంత మెరుగుపడుతుందో తెలీదు. పైగా ఈ స్థాయిలో దోపిడీని అరికట్టాలంటే ఏదో ఒకటి చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది.

ఈ క్రమంలో అధిక చెల్లింపుల మీద మరో రూపంలో లబ్ధి పొందేందుకు పవర్ చార్జీలను తక్కువగా ఉండేలా చూడాలని బేరాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. దీంతోపాటు మరో ప్రతిపాదన కూడా ఉంది. విద్యుత్ చార్జీలు తగ్గించకపోయినా, కనీసం వడ్డీ చెల్లింపులను పదేళ్ల పాటు లేకుండా ఉండేలా చూడాలని కూడా పాకిస్తాన్ మరో ప్రతిపాదన చేస్తున్నట్టు ఆ దేశం నుంచి సమాచారం ఉన్నట్టు తెలిసింది.

Tags :
|

Advertisement