Advertisement

  • రోహిత్ బ్యాటింగ్ చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది ..కమ్రాన్ అక్మల్

రోహిత్ బ్యాటింగ్ చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది ..కమ్రాన్ అక్మల్

By: Sankar Mon, 20 July 2020 3:06 PM

రోహిత్ బ్యాటింగ్ చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది ..కమ్రాన్ అక్మల్



ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో రోహిత్ ఒకడు ..ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో రోహిత్ ఆట గురించి చెప్పడానికి మాటలు సరిపోవు ..కెరీర్ ప్రారంభంలో అంతగా రాణించని రోహిత్ ఎప్పుడైతే ఓపెనర్ అవతారం ఎత్తాడో ఇక అక్కడ నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు ..లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో పరుగుల వరద పరిస్థి సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్లో రెండో స్థానంలో ఉన్నాడు ..అయితే ఇటీవల కాలంలో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు , మాజీ ఆటగాళ్లు రోహిత్ మీద ప్రశంసలు కురిపించడం చూస్తూనే ఉన్నాం ..

తాజాగా పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కూడా రోహిత్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు ..లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో రోహిత్ ఆట అమోఘం అని కొనియాడాడు ..అతను బ్యాటింగ్‌ చేస్తుంటే.. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందన్నాడు. రోహిత్‌ బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని చూసి యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలని కమ్రాన్‌ సూచించాడు.మయానుకూలంగా, నిబద్ధతతో బ్యాటింగ్‌ చేస్తాడని ఈ పాకిస్థాన్‌ ఆటగాడు ప్రశంసించాడు..

కాగా ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ తీసిన మ్యాచ్ల్లో తాను సెంచరీ చేసి జట్టును గెలిపించడం వెనుక అప్పటి కెప్టెన్ ఇంజమామ్ స్ఫూర్తి నింపిన మాటలు ఉన్నాయి అన్నాడు ఈ మాజీ వికెట్ కీపర్ ..నేను బ్యాటింగ్ వెళ్లే సమయానికి పాక్ జట్టు 40 పరుగుల లోపే ఆరు వికెట్లు కోల్పోయింది ..దీనితో ఇంజి భాయి వచ్చి ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది న్వ్ ఎం ఒత్తిడి తీసుకోకు నీ సహజసిద్ధమైన ఆటను నువ్వు ఆడు , నువ్వు ఎంత చెత్తగా ఆడిన ఇపుడు జరిగిన నష్టం కంటే తక్కువ అవుతుంది అని నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపి పంపించాడు అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు ..

Tags :
|

Advertisement