Advertisement

  • పాకిస్తాన్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూత

పాకిస్తాన్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూత

By: Sankar Thu, 03 Dec 2020 5:17 PM

పాకిస్తాన్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూత


పాక్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూశారు. బుధవారం రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని జమాలి కుమారుడు మొహమ్మద్‌ ఖాన్‌ జమాలి వెల్లడించారు.

76 ఏళ్ల జమాలీ కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో.. రావల్పిండిలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ (ఏఎఫ్‌ఐసీ- ఎన్ఐహెచ్‌డీ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వస్తున్నారు. కాగా జమాలి ఆరోగ్యం మరింత విషమించి మరోసారి గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు..

మాజీ మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2002 నవంబర్ నుంచి 2004 జూన్ వరకు జమాలీ ప్రధానిగా కొనసాగారు. కాగా ఆ తర్వాత ముషారఫ్‌తో వచ్చిన విభేదాల కారణంగా 2004లో ప్రధాని పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

Tags :

Advertisement