Advertisement

  • నేను హిందువు అయినందుకు గర్విస్తున్నాను ..పాక్ క్రికెటర్ డేనిష్ కనేరియా

నేను హిందువు అయినందుకు గర్విస్తున్నాను ..పాక్ క్రికెటర్ డేనిష్ కనేరియా

By: Sankar Thu, 30 July 2020 10:05 PM

నేను హిందువు అయినందుకు గర్విస్తున్నాను ..పాక్ క్రికెటర్ డేనిష్ కనేరియా



పాక్ క్రికెట‌ర్‌ ఉమర్ అక్మల్‌కు విధించిన‌ మూడేళ్ల నిషేదాన్ని 3 సంవత్సరాల నుంచి 18 నెలలకు తగ్గించడం ప‌ట్ల‌ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అక్మ‌ల్ విష‌యంలో క‌నిక‌రించిన పీసీబీ నా విష‌యంలో మాత్రం ఏం ప‌ట్టింపులేన‌ట్లు వ్య‌వ‌హరిస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

జీరో-టాలరెన్స్ విధానం నాపై మాత్రమే వర్తిస్తుందని, పాకిస్తాన్‌లోని ఇతర ఆటగాళ్లకు మాత్రం వ‌ర్తించ‌దు. కేవ‌లం మతం కారణంగా నేను వివక్షకు గురయ్యా. మ్యాచ్ ఫిక్సింగ్ విధానాన్ని నివేదించడంలో విఫలమైనందుకు ఉమర్ అక్మల్‌కు క్రికెట్ నుంచి మూడేళ్ల నిషేధం 18 నెలలకు తగ్గించబడింది..

అంటే అతను వచ్చే ఏడాది ఆగస్టులో తిరిగి ఆటలోకి తిరిగి వస్తాడు. నాకు జీవిత నిషేధం విధించడానికి గల కారణాన్ని ఎవరైనా సమాధానం చెప్పగలరా.నా రంగు, మతం, బ్యాక్ గ్రౌండ్ కారణంగా నాకు ఈ విధానాలు వరిస్తాయి. అయితే నేను హిందువును అందుకు నేను గర్వంగా ఉన్నాను' అని డానిష్ కనేరియా తెలిపాడు.

Tags :
|
|

Advertisement