Advertisement

  • కరోనా నెగెటివ్ వచ్చింది అని సోషల్ మీడియాలో పెట్టినందుకు హఫీజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పిసిబి .

కరోనా నెగెటివ్ వచ్చింది అని సోషల్ మీడియాలో పెట్టినందుకు హఫీజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పిసిబి .

By: Sankar Thu, 25 June 2020 10:04 AM

కరోనా నెగెటివ్ వచ్చింది అని సోషల్ మీడియాలో పెట్టినందుకు హఫీజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పిసిబి .



కరోనా నెగెటివ్ రావడంతో ఆ ఆనందం తట్టుకోలేక అభిమానులతో పంచుకోవడం కోసం సోషల్ మీడియా లో తన నెగెటివ్ రిపోర్టులను పెట్టడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహానికి గురి అయ్యాడు ఆ దేశ స్టార్ ఆటగాడు మొహ్మద్ హఫీజ్ ..ఇంగ్లాండ్ పర్యటనకి ఎంపికైన పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లకి రెండు రోజుల క్రితం కరోనా పరీక్షల్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహించగా.. అందులో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో.. కంగారుపడిన ఆటగాళ్లు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు

అయితే హఫీజ్ మాత్రం సెకండ్ ఒపీనియన్ కోసం సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి తాను మరియు తన ఫామిలీ మెంబెర్స్ అందరు కరోనా టెస్టులు చేయించుకున్నారు దీనిలో నెగెటివ్ రావడంతో ఆనందంతో సోషల్ మీడియాలో అల్లా దయ వాళ్ళ నాకు కరోనా నెగెటివ్ వచ్చింది అని పెట్టాడు ..

అయితే.. హఫీజ్ చర్యపై పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ మండిపడ్డాడు. ఇప్పుడు మిగిలిన 9 మంది ఆటగాళ్లని కూడా హఫీజ్ గందరగోళంలో పడేశాడని విమర్శించిన వసీమ్ ఖాన్.. టెస్టు ఫలితాన్ని ఫస్ట్ పీసీబీకి చెప్పి ఉండాల్సిందని సూచించాడు.మహ్మద్ హఫీజ్‌తో నేను మాట్లాడాను. అతని తీరు పీసీబీని పూర్తిగా అసంతృప్తికి గురిచేసింది. వ్యక్తిగతంగా కరోనా వైరస్ టెస్టుని చేసుకునే హక్కు అతనికి ఉంది. కానీ.. టెస్టు ఫలితాన్ని తొలుత పీసీబీకి చెప్పి ఉండాల్సింది. అలాకాకుండా.. ఇప్పుడు అతనే స్వయంగా ప్రకటించి.. పాక్ జట్టులో గందరగోళ వాతావరణం సృష్టించాడు. గతంలోనూ అతను క్రమశిక్షణ తప్పి మందిలింపుని ఎదుర్కొన్నాడు.. తాజాగా మరోసారి అతడ్ని హెచ్చరించా’’ అని వసీమ్ ఖాన్ వెల్లడించాడు.

Tags :
|
|

Advertisement