Advertisement

  • మాపై ఎలాంటి ఒత్తిడి లేదు ..అభినందన్ విషయంలో మాట మార్చిన పాకిస్తాన్

మాపై ఎలాంటి ఒత్తిడి లేదు ..అభినందన్ విషయంలో మాట మార్చిన పాకిస్తాన్

By: Sankar Fri, 30 Oct 2020 12:13 PM

మాపై ఎలాంటి ఒత్తిడి లేదు ..అభినందన్ విషయంలో మాట మార్చిన పాకిస్తాన్


అభినందన్ వర్ధమాన్ విషయంలో కొద్ది గంటల్లోనే మాటమార్చింది పాకిస్థాన్... అభినందన్‌ను విడుదల చేసే విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ప్రకటించింది. కాగా, వర్ధమాన్ విషయంలో ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లలో వణుకు పుట్టిందని, ఆయనకు ముచ్చెమటలు పట్టాయని పీఎంఎల్ నేత అయాజ్ సాదిక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే..

అయితే, కొద్ది గంటలకే పాకిస్థాన్‌ ఈ ప్రకటన చేసింది.. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల విషయంలో పాక్ పై ఎలాంటి ఒత్తిడి లేదని.. కేవలం శాంతిని దృష్టిలో పెట్టుకునే మేం వర్ధమాన్‌ను విడిచిపెట్టాం.. మేం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం హర్షించింది.. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పుకొచ్చారు ఆదేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌధురి.

కాగా.. భారత్‌పై పాకిస్థాన్‌ తన అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే.. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్‌ ప్రజల విజయమని ఆదేశ మంత్రి ఫవద్‌ ఛౌధురీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఏకంగా పాక్‌ జాతీయ అసెంబ్లీలో.. 'భారత్‌ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం. పుల్వామాలో విజయం సాధించాం. ఇమ్రాన్‌ నాయకత్వంలో పాక్‌ విజయం సాధించింది.. అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Tags :
|

Advertisement