Advertisement

  • టిక్ టాక్ కు మరొక భారీ షాక్ ..ఆ దేశంలో కూడా టిక్ టాక్ పై నిషేధం

టిక్ టాక్ కు మరొక భారీ షాక్ ..ఆ దేశంలో కూడా టిక్ టాక్ పై నిషేధం

By: Sankar Fri, 09 Oct 2020 10:14 PM

టిక్ టాక్ కు మరొక భారీ షాక్ ..ఆ దేశంలో కూడా టిక్ టాక్ పై నిషేధం


సోషల్ మీడియా దిగ్గజం చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో షాక్ తగిలింది. భారత్‌, అమెరికాలో ఈ యాప్‌పై ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది. తాజాగా, పాకిస్థాన్‌లో కూడా ఎదురుదెబ్బ తగిలింది.

టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ (పీటీఏ) ఆదేశాలు శుక్రవారం జారీచేసింది. ఈ యాప్‌లో అనైతిక/ అభ్యంతరకర సమాచారానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

చట్టవిరుద్ధమైన సమాచారాన్ని నియంత్రించేందుకు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సమయం ఇచ్చినా ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. ఆ సంస్థ చర్యలు సంతృప్తికరంగా లేకపోవడంతో నిషేధం విధించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. యాప్‌లో అభ్యంతరకరమైన సమాచారాన్ని తొలగించాలని జులై చివరిలోనే హెచ్చరించినట్టు వివరించారు. ఇదిలా ఉండగా, పాక్ నిర్ణయంపై టిక్‌టాక్‌ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌కు 39 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేకంగా దీనిపై ఆదేశాలు వెలువరించడంతో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ఉన్నతస్థాయి వ్యక్తి వెల్లడించారు. సాంప్రదాయిక ఇస్లామిక్ దేశంలో అసభ్యకరమైన కంటెంట్ నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని టెలివిజన్ అధికారులను ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు

Tags :
|

Advertisement