Advertisement

  • ఆ దేశంలో పబ్ జి నిషేధం ..తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత ..

ఆ దేశంలో పబ్ జి నిషేధం ..తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత ..

By: Sankar Fri, 17 July 2020 2:58 PM

ఆ దేశంలో పబ్ జి నిషేధం ..తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత ..



పబ్ జి ..ఈ పేరు చెప్తే చాలు యువతకు ఎక్కడలేని ఉత్సహం వస్తుంది ..గంటల తరబడి పబ్ జి లో మునిగిపోతున్నారు నేటి యువత ..అయితే దీని వాళ్ళ ఉపయోగాలకంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంటున్నారు ..అయితే ఈ వీడియో గేమ్​ను ‘యాంటీ ఇస్లాం’గా పేర్కొంటూ పాకిస్తాన్ నిషేధం విధించింది. పబ్​జీ వల్ల యువకుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని, ఎంతో విలువైన సమయమూ వృథా అవుతోందని ఇమ్రాన్​ ఖాన్​ సర్కారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీన్ని పాకిస్తానీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సింధ్​–పంజాబ్​ సరిహద్దు వద్ద ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ధర్నాలు చేయడానికి సిద్ధపడుతోంది..

పబ్​జీ నిషేధాన్ని సవాలు చేస్తూ ఇస్లామాబాద్​ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్​ దాఖలైంది. పబ్​జీలో యాంటీ ఇస్లాం మెటీరియల్​తో పాటు శృంగారపరమైన దృశ్యాలున్నాయని, అందుకే గేమ్​ను బ్యాన్​ చేశామని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) కోర్టుకు నివేదించింది. పబ్​జీ బ్యాన్​కు ముందు గేమ్​ మిషన్​లో ఫెయిలైనందుకు ఒత్తడిని తట్టుకోలేక కొందరు యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సైతం పీటీఏ ప్రస్తావించింది..

అయితే ఇప్పటికే పబ్​జీపై నిషేధం ఎత్తేయాలంటూ యువత రోడ్లు ఎక్కింది. ప్లకార్డులతో నిరసన తెలుపుతోంది. పబ్​జీకి కొందరు బానిసలైతే, ఇంకొందరికి అదో ఎంటర్​టైన్​మెంట్. గడచిన నాలుగు నెలల లాక్​డౌన్​లో చాలా మందికి ఇదే టైం పాస్. అందుకే ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు పాకిస్తాన్​ పబ్​జీ ప్రియులు ట్విట్టర్​​, ఫేస్​బుక్​ తదితర సోషల్​మీడియా వేదికల్లో చిన్నపాటి ఉద్యమాలు రన్ చేస్తున్నారు.

పబ్​జీని యాంటీ ఇస్లాంగా చూస్తున్న పాకిస్తాన్​కి టిక్​టాక్ అలా​ కనిపించడం లేదు. దానిలో శృంగార సంబంధిత కంటెంట్​ వస్తున్నా పట్టడం లేదు. ఈ మేరకు ఇస్లామాబాద్​ హైకోర్టులో టిక్​టాక్​ను నిషేధించాలంటూ పిటిషన్​ కూడా దాఖలైంది.

Tags :
|
|

Advertisement