Advertisement

  • భారత్ రాఫెల్ యుద్ధ విమానాలపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్

భారత్ రాఫెల్ యుద్ధ విమానాలపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్

By: chandrasekar Fri, 14 Aug 2020 4:28 PM

భారత్ రాఫెల్ యుద్ధ విమానాలపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్


భారత్ రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుపై పాకిస్తాన్ ఆర్మీ అధికార స్పందించారు. సైన్యానికి ఖర్చు చేసే విషయంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందని, సైన్యానికి బడ్జెట్ కూడా అధికంగానే కేటాయిస్తోందని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్ ఆక్రోశం వెళ్లగక్కారు. దేశ భద్రతకోసం ఫ్రాన్స్ నుంచి భారత్ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ తాము భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే తగిన జవాబిచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆయన ప్రకటించారు. తీవ్ర వాదులను ప్రోత్సహించడం వల్ల ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఎవ్వరు వీరికి మద్దతివ్వక పోవడంతో పాకిస్థాన్ చాలా ఆందోళనగా వుంది.

భారత దేశం ఐదు రాఫెళ్లను కొనుగోలు చేసినా 500 రాఫెళ్లను కొనుగోలు చేసినా తాము మాత్రం ఎలాంటి ఆందోళన చెందమని, భయపడమని ఆయన తెలిపారు. తాము పూర్తిగా సంసిద్ధతతోనే ఉన్నామని, తమ సామర్థ్యంపై తమకు ఎలాంటి సందేహాలూ లేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సైన్యం, రక్షణ కోసం పాకిస్తాన్ విపరీతంగా బడ్జెట్ కేటాయిస్తోందని కొందరు తమను ఆడిపోసుకుంటారని, అయితే గత పదేళ్లుగా రక్షణ రంగంపై కేటాయించే బడ్జెట్ తగ్గుతోందని జనరల్ బాబ్ ఇఫ్తికార్ తెలిపారు. పాకిస్థాన్లో తీవ్రవాదం అధికమవ్వడంతో ప్రపంచదేశాల పెట్టుబడులు ఏవీ పొందలేక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇందువల్ల ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తగ్గింది.

Tags :

Advertisement