Advertisement

  • భారత్ కు ఇప్పుడు రాఫెల్ విమానాలతో ఎం అవసరం ..అక్కసు వెళ్లగక్కిన పాక్

భారత్ కు ఇప్పుడు రాఫెల్ విమానాలతో ఎం అవసరం ..అక్కసు వెళ్లగక్కిన పాక్

By: Sankar Thu, 30 July 2020 6:04 PM

భారత్ కు ఇప్పుడు రాఫెల్ విమానాలతో ఎం అవసరం ..అక్కసు వెళ్లగక్కిన పాక్



రాఫెల్ జెట్ ఫైటర్ విమానాలు భారత్ కు రావడాన్ని పొరుగు దాయాది దేశం పాకిస్తాన్ కు ఏమాత్రం గిట్టడం లేదు. అంబాలాలో అడుగుపెట్టిన రాఫెల్ ఫైటర్లను చూసిన పాక్ తన అక్కసును వెళ్లగక్కింది. భద్రతా అవసరాలకు మించి సైనిక సామర్ధ్యాలను భారత్ కూడగట్టుకుంటోంది.. అని పాకిస్థాన్ తన కుళ్లుబోతుతనాన్ని మరోసారి ప్రదర్శించింది.

రాఫెల్ విమానాలు ఇప్పుడు భారత్ కు ఏం అవసరం, వారు భద్రతకు కావాల్సిన సైనిక సామర్ధ్యాలను మించి కూడగట్టుకుంటున్నారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. దక్షిణ ఆసియాలో ఆయుధ పోటీకి దారితీసే భారతదేశాన్ని అసమానమైన ఆయుధాల సేకరణ నుంచి నిరోధించాలని ప్రపంచ సమాజాన్ని కోరుతున్నామన్నారు.

నిన్న అంబాలా ఎయిర్ బేస్ వద్ద ఐదు రాఫెల్ జెట్ విమానాలు ల్యాండ్ అయిన తరువాత పాకిస్తాన్ నుంచి వచ్చిన మొదటి అధికారిక స్పందన ఇది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్క్వాడ్రన్ బలం ఇప్పుడు 31 కి చేరుకున్నది. ఈ విమానం రకరకాల మిషన్లను నిర్వహించగల సామర్థ్యం ఉన్నందున భారత వైమానిక దళానికి రాఫేల్‌ రాక ఆట మార్చే సముపార్జనగా రక్షణ, భద్రతా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :
|
|
|
|

Advertisement