Advertisement

  • దేశ అత్యున్నత పురస్కారాలకు దరఖాస్తు కోరుతున్న కేంద్రం

దేశ అత్యున్నత పురస్కారాలకు దరఖాస్తు కోరుతున్న కేంద్రం

By: Sankar Thu, 02 July 2020 8:35 PM

దేశ అత్యున్నత పురస్కారాలకు దరఖాస్తు కోరుతున్న కేంద్రం



భార‌త‌దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలు ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ‌భూష‌న్‌, ప‌ద్మ‌శ్రీ నామినేష్ల‌న స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ఆహ్వానించింది. కేవ‌లం ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తులు పంపాల‌ల్సిందిగా కోరింది. వారి రంగాల్లో అత్యుత‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా అవార్డుల‌ను బ‌హుక‌రిస్తుంది. నామినేష‌న్ చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 15న ముగుస్తుంద‌ని ఈలోగా ద‌ర‌ఖాస్తులు పంపాల్సిందిగా కోరింది. 1954 నుంచి మొద‌లైన ఈ అవార్డుల ప‌ర్వం ప్ర‌తి సంవ‌త్స‌రం దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది.

జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా క‌ళ‌,సాహిత్యం, విద్య‌,క్రీడ‌లు, సామాజికం, సైన్స్ అండ్ టెక్నాట‌జీ స‌హా వివిధ రంగాల్లో విశిష్ట‌మైన‌, అసాధార‌ణ‌మైన విజ‌యాలు సాధించిన‌వారు ప‌ద్మ అవార్డుల‌కు అర్హులు. అంతేకాకుండా సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు , సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిని గుర్తించి వారి వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సిందిగా ఇప్ప‌టికే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాలు, ప‌ద్మ అవార్డుల గ్ర‌హీత‌ల‌కు కేంద్ర హోంశాఖ కోరింది.

అంతేకాకుండా పౌరులు కూడా స్వ‌త‌హాగా నామినేష‌న్లు దాఖ‌లు చేయోచ్చ‌ని పేర్కొంది. గ‌రిష్టంగా 800 ప‌దాల‌కు మించ‌కుండా సిఫార‌సులో సూచించిన ఫార్మాట్ త‌ర‌హాలో ప‌ద్మ అవార్డుల పోర్ట‌ల్‌లో సంబంధిత వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌ని తెలిపింది

Tags :
|
|
|

Advertisement