Advertisement

  • IPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్ జట్టు నుంచి తప్పుకున్నపేస్ బౌలర్ హ్యారీ గర్నీ

IPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్ జట్టు నుంచి తప్పుకున్నపేస్ బౌలర్ హ్యారీ గర్నీ

By: chandrasekar Thu, 27 Aug 2020 10:16 AM

IPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్ జట్టు నుంచి తప్పుకున్నపేస్ బౌలర్ హ్యారీ గర్నీ


కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు IPL 2020 ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలర్ హ్యారీ గర్నీ టోర్నీ మొదలుకాకముందే ఐపీఎల్ తాజా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. భుజం గాయం కారణంగా అతడు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో రిపోర్ట్ చేసింది.

హ్యారీ గర్నీ యూఏఈకి వెళ్లడం లేదని, కేకేఆర్ జట్టుకు ఈ సీజన్‌లో విదేశీ పేసర్ దూరం కానున్నాడని చెప్పాడు. చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు మొదలయ్యాయని సంతోషిస్తుండగానే తాను గాయపడ్డందుకు బాధగా ఉందని హ్యారీ గర్నీ తెలిపాడు.

గతేడాది తొలిసారి కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన గర్నీ ఈ సీజన్‌లో రాణించి తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. కానీ గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి ఆరంభానికి ముందే నిష్క్రమించాడు. నాటింగ్‌హామ్‌ షైర్‌లో గత మూడు టీ20 సీజన్లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్ హ్యారీ దూరం కావడంతో కేకేఆర్ విదేశీ ఆటగాళ్ల సంఖ్య 7కు తగ్గిపోయింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది.

Tags :
|
|

Advertisement