Advertisement

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌కే తొలి అనుమతి...?

By: chandrasekar Mon, 14 Dec 2020 8:40 PM

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌కే తొలి అనుమతి...?


అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో అత్యవసర వినియోగానికి వాక్సిన్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైజర్ ఇండియా భారత్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అయితే, కేంద్రం ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండటంతో పాటు దీనిని భద్రపరిచేందుకు మైనస్ 70 నుంచి 90 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమే ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాక్సిన్ ను భద్రపరచి, రవాణా చేయడం అత్యంత క్లిష్టమైన పనని దీని వల్ల కేంద్రం విముఖత చూపిస్తున్నట్లు ఫార్మా నిపుణులు అంటున్నారు. యూఎస్‌లో వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్‌లను రూపొందించి, స్వయంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. అటువంటి పరిస్థితి భారత్‌లో లేదు. వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు ముంబయి విమానాశ్రయం కార్గోలో ఏర్పాట్లు చేసినా, దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం చాలా కష్టమైన పని.

బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్‌లు కలిసి తయారు చేసిన టీకా ధర 10 డాలర్లలోపే దొరుకుతుంది. ఇంటిలో వినియోగించే సాధారణ రిఫ్రిజిరేటర్‌లలోనే నిల్వ చేసే అవకాశాలు ఉండటంతో ఆక్స్‌ఫర్డ్‌కే తొలి అనుమతి లభించనుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. కోవిషీల్డ్ ఒక్కో డోసు 3 డాలర్లుగా ఉంటుందని సీరమ్ సంస్థ వెల్లడించింది. ఫైజర్ కంటే స్పుత్నిక్ వాక్సిన్

ధర తక్కువ. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా స్వదేశీ టీకా ఒక్కో డోస్ 3-6 డాలర్ల వరకు ఉంటుంది. వీటితో పోల్చితే ఫైజర్ ధర చాలా ఎక్కువ. తొలి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఇందుకు 680 మిలియన్ డోస్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధ౦గా ఉంది. ఒక్కో డోస్ 3 డాలర్లు ఉంటుందనే అంచనాతో మొత్తం 1.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

Tags :
|
|

Advertisement