Advertisement

  • కరోనా వ్యాక్సిన్ ..గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ

కరోనా వ్యాక్సిన్ ..గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ

By: Sankar Sun, 04 Oct 2020 2:55 PM

కరోనా వ్యాక్సిన్ ..గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ


ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు అనేక దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయి..అయితే అందరి దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ డెవలప్‌చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌పైనే ఉంది.. ఓవైపు క్లినికల్ ట్రయల్స్ సాగుతుండడంతో.. మధ్యలో కొన్ని సార్లు ట్రయల్స్‌కు బ్రేక్‌లు పడడంతో.. అసలు ఆ వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే చర్చ సాగుతోన్న సమమంలో.. గుడ్‌న్యూస్ చెప్పింది ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ..

ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. 2021 ప్రారంభానికి టీకా అందుబాటులోకి రానుంది అంటున్నారు. ఈ వ్యాక్సిన్ ఆరునెలల్లో ప్రజలకు అందుబాటులో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది బ్రిటన్.. ఈ ఏడాది చివరి నాటికి రెగ్యులేటరీ అధికారుల నుంచి ఆమోదం లభిస్తుందని, ఆ వెంటనే టీకాను ప్రజలకు అందుబాటులో తెస్తామని చెబుతున్నారు.

మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగ ఫలితాల సమీక్షను ప్రారంభించినట్టు ఐరోపా ఔషధాల సంస్థ పేర్కొంది. ఈ టీకా అందుబాటులోకి వస్తే యూరోపియన్ దేశాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. భారత్‌లోనూ ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రయోగాలు జరుగుతుండగా.. అవి ఫైనల్‌ దశకు చేరుకుంటే.. భారీ సంఖ్యలో కోవిడ్ టీకాలు ఉత్పత్తి చేసి, సగం భారత్‌లో వినియోగించడం.. మిగతావి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. కాగా, బిల్‌గేట్స్‌ లాంటి ప్రముఖులు సైతం ఆక్స్‌ఫర్డ్-సీరమ్ కోవిడ్ వ్యాక్సిన్‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement