Advertisement

  • ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వాక్సిన్ తొలి దశ ఫలితాలు వెల్లడి

ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వాక్సిన్ తొలి దశ ఫలితాలు వెల్లడి

By: Sankar Mon, 20 July 2020 8:24 PM

ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వాక్సిన్ తొలి దశ ఫలితాలు వెల్లడి



కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తొలి నుంచి కరోనా వ్యాక్సిన్‌‌ ప్రయోగాల్లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ముందు వరుసలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సిన్‌ తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ సంబంధించిన డేటా వెలువడింది. లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ఈ ఫలితాలను ప్రచురించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన గుణం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఇది సురక్షితమైనదని వెల్లడించారు.

ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో దాదాపు 1,077 మందిపై వ్యాక్సిన్‌ ప్రయోగించగా.. వీరిలో యాంటీబాడీస్‌తోపాటుగా, కరోనాతో పోరాడగలిగే తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ ద్వారా భయంకరమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌‌ లేవని అన్నారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న వాలంటీర్లలోని పలువురిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని.. అయితే పరిశోధకులు వాటిని పారాసిటమాల్‌తో తగ్గించగలిగారని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో కరోనాను అడ్డుకోగలుగుతుందో లేదో తెలియాలంటే.. మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఇక ఇండియాలో కూడా కరోనా వాక్సిన్ ట్రైల్స్ ప్రారంభం అయ్యాయి ..హైద్రాబాద్లోని నిమ్స్ లో ఇద్దరు వాలంటీర్ లకు వాక్సిన్ ఇచ్చారు ..ఇక ఢిల్లీ లోని ఐయిమ్స్ లో కరోనా వాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం అవుతున్నాయి

Tags :
|
|

Advertisement