Advertisement

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఓవర్ స్పీడ్ ఫైన్

By: chandrasekar Thu, 04 June 2020 6:29 PM

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఓవర్ స్పీడ్ ఫైన్


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు పోలీసులు ఓవర్ స్పీడ్ ఫైన్ విధించారు. ప్రజలందరితో పాటే సీఎం వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని తెలంగాణ పోలీసులు రుజువుచేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మూడు ఫైన్లు విధించారు. మరో ఫైన్‌ను కోదాడ పరిధిలో విధించారు.

కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో అక్టోబర్ 16, 2019న ఒకటోది మరియు మాదాపూర్ పరిధిలో ఏప్రిల్ 15, 2020న రెండోది, టోలిచౌకి పరిధిలో ఏప్రిల్ 29న మూడోది, ట్యాంక్‌బండ్ పరిధిలో జూన్ 1, 2020న నాల్గోది విధించారు. ఈ నాలుగు ఫైన్లు ఓవర్ స్సీడ్‌కి చెందినవే కావడం గమనార్హం.

తాజాగా జూన్ 1న పడిన జరిమానాతో మొత్తం ఫైన్ 4,140 అయింది. సీఎం కాన్వాయ్‌కు ఫైన్ పడిన విషయం మీడియాలో రావడంతో వెంటనే స్పందించిన సీఎంవో కార్యాలయం ఫైన్లు చెల్లించింది. దాంతో ఈ-చలానాలో కారుకు సంబంధించిన విషయాలు నో పెండింగ్ చలాన్స్‌గా చూపిస్తుంది.

Tags :
|
|
|
|

Advertisement