Advertisement

  • హైదరాబాద్ లోని డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో లక్ష కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడి

హైదరాబాద్ లోని డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో లక్ష కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడి

By: chandrasekar Sat, 29 Aug 2020 09:49 AM

హైదరాబాద్ లోని డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో లక్ష కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడి


మాక్ ఇన్ ఇండియా లో భాగంగా హైదరాబాద్‌‌లోని డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో లక్ష కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడి పెట్ట నున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్‌గా ఉన్న భాగ్యనగరం డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లోనూ పురోగమిస్తోన్న సంగతి తెలిసిందే. రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్రం భావిస్తోన్న వేళ హైదరాబాద్‌‌లోని డిఫెన్స్, ఏరోస్పేస్ రంగం రాబోయే 2-3 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయలకుపైగా ఆర్డర్లను రాబట్టనుంది. దీని గురించి వివరాలను డీఆర్‌డీవో చైర్మన్, రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి విభాగం సెక్రటరీ అయిన జి.సతీష్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ కేంద్రంగా అనేక రక్షణ పరికరాలు తయారుచేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మేకిన్ తెలంగాణ అంశంపై సీఐఐ వర్చువల్ భేటీ సందర్భంగా సతీష్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. అభివృద్ధిలో దూసుకెళ్తూ పెట్టుబడుల ఆకర్షణలో ముందజలో ఉన్న హైదరాబాద్ నగరానికి మంచి రోజులొచ్చాయన్నారు. కేంద్రం ఇప్పటికే 101 ఆయుధాలు, పరికరాల దిగుమతిపై నిషేధం విధించిందని డీఆర్‌డీవో చీఫ్ తెలిపారు. 108 ఆయుధాలను దేశీయంగా డెవలప్ చేసుకోవచ్చని డీఆర్‌డీవో ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖకు ఓ నివేదిక సమర్పించిందన్నారు. దేశానికీ కావలసిన రక్షణ పరికరాలను తయారుచేయడంలో హైదరాబాద్ కీలకంగా మారనుంది.

అధిక భాగం స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే వివిధ రకాల ఆయుధాలు మరియు విడి భాగాలు తయారు చేయనున్నారు. దేశంలో డిఫెన్స్ ఎక్వైజేషన్ కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ఊతం లభిస్తుందన్నారు. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కోసం బీడీఎల్‌కు రూ.25 వేల కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని మరో రూ.10 వేల కోట్ల ఆర్డర్లపై సంప్రదింపులు జరుగుతున్నాయని డీఆర్‌డీవో చీఫ్ తెలిపారు. ఇందులో ప్రయివేట్ రంగానికి భాగస్వామ్యం ఉండటం వల్ల హైదరాబాద్‌లోని యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. డిఫెన్స్ ఆర్ అండ్ డీ, రక్షణ మంత్రిత్వ శాఖకు హైదరాబాద్ కీలక కేంద్రం. మా బడ్జెట్‌లో చాలా వరకు హైదరాబాద్ నగరానికే వెళ్తోంది. వచ్చే 2-3 ఏళ్లలో మరిన్ని ఉత్పత్తులు రానున్నాయి. అవి హైదరాబాద్‌లోని ఇండస్ట్రీకి భారీగా ఊతమిస్తాయని సతీష్ రెడ్డి తెలిపారు.

Tags :

Advertisement