Advertisement

రష్యాలో 3000 మందికి కరోనా వ్యాక్సిన్‌

By: Sankar Mon, 28 Sept 2020 9:09 PM

రష్యాలో 3000 మందికి కరోనా వ్యాక్సిన్‌



ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది..అగ్ర రాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి ..అయితే కరోనా మహమ్మారి నిర్ములనకు వాక్సిన్ ప్రయోగాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి ..

ప్రపంచంలోనే మొట్టమొదటి కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా దాన్ని వేగంగా పరీక్షిస్తోంది. ఇటీవల ఆ దేశరాజధాని మాస్కోలోని మూడు వేలమందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. వారిలో ఎవరికీ ఎలాంటి దుష్ప్రభావాలు కలుగలేదని మాస్కో మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నానని, చాలా నెలలు గడిచిపోయినా తనకు ఏమి జరుగలేదని ఆయన పేర్కొన్నారు.

కాగా, టీకా తీసుకునేందుకు మాస్కోలో 60,000 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నారు. రష్యా రిజిస్టర్‌ చేసిన స్పుత్నిక్‌ వీ అడినోవైరస్‌ వెక్టర్‌ ఆధారిత వ్యాక్సిన్‌ను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ సహకారంతో గమలేయ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. ఆగస్టు 11న దీన్ని రష్యా రిజిస్టర్‌ చేసింది.



Tags :
|

Advertisement