Advertisement

  • ఢిల్లీ జనాభాలో దాదాపు పావు శాతం మంది కరోనా బారిన పడ్డారు .. కేంద్ర ఆరోగ్య శాఖ సర్వే

ఢిల్లీ జనాభాలో దాదాపు పావు శాతం మంది కరోనా బారిన పడ్డారు .. కేంద్ర ఆరోగ్య శాఖ సర్వే

By: Sankar Tue, 21 July 2020 4:33 PM

ఢిల్లీ జనాభాలో దాదాపు పావు శాతం మంది కరోనా బారిన పడ్డారు .. కేంద్ర ఆరోగ్య శాఖ సర్వే



దేశ రాజధాని ఢిల్లీని కరోనా అతలాకుతలం చేసింది ..దాదాపు పవి శాతం మంది ప్రజలు కరోనా కు ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యారు అని ఒక సర్వేలో తేలింది ..మొత్తం జానాభాలోని 23.48 శాతం మంది శరీరాల్లో కరోనా నిరోధక యాంటీబాడీలు(వైరస్‌ను నిర్వీర్యం చేసే ప్రోటీన్లు) ఉన్నట్టు తేలింది. దీనర్థం.. వీరందరూ గతంలో ఏదోక సమయంలో కరోనాను ఎదుర్కొన్నట్టు భావించాలని వైద్య నిపుణలు చెబుతున్నారు.

కరోనా సంక్షోభం ప్రారంభమై దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అయినా ఢిల్లీలోని కేవలం 23.48% జనాభానే ప్రభావితమయ్యారు. ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించడమే దీనికి కారణం’ అని ఈ నివేదిక తేల్చింది. అంతే కాకుండా.. కరోనా బారిన పడిన అనేక మంది ఎటువంటి రోగ లక్షణాలు లేని విషయం కూడా ఈ సెరో సర్వేలో వెల్లడైంది.

జనాభాలో అధికశాతం మంది ఇప్పటికీ కరోనా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి.. వ్యాధి కట్టడి కోసం కంటైన్మెంట్ వ్యూహాన్నీ మునపటి తీవ్రతోనే అమలు చేయాలి. భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి నిబంధనలు పక్కగా పాటించాలి’ అని ఈ సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ ఈ సర్వేను పర్యవేక్షించింది. జున్ 27 నుంచి జులై 10 మధ్య జిరగిన ఈ అధ్యయనంలో దాదాపు 21 వేల శాంపిళ్లను కరోనా నిర్ధారణ పరీక్షల కోసం సేకరించారు.

Tags :
|

Advertisement