Advertisement

  • బీసీసీఐ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే ఔట్‌డోర్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌

బీసీసీఐ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే ఔట్‌డోర్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌

By: chandrasekar Sat, 13 June 2020 12:44 PM

బీసీసీఐ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే ఔట్‌డోర్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌


ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. అథ్లెట్లు వ్యక్తిగతంగా తమ ఔట్‌డోర్‌ శిక్షణ మొదలుపెట్టారు. అయితే టీమిండియా క్రికెటర్లు తమ ప్రాక్టీసును మళ్లీ మొదలుపెట్టేందుకు బీసీసీఐ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఓ న్యూస్‌ ఏజెన్సీతో ఓ క్రికెటర్‌ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

బీసీసీఐ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే ఔట్‌డోర్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలవుతుందన్నారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నిక్‌ వెబ్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌ ఇస్తున్న శిక్షణ సూచనల మేరకు క్రికెటర్లు ఇండ్లల్లో కసరత్తులు చేస్తున్నారన్నారు. వారి గైడెన్స్‌ ప్రకారమే వర్కౌట్‌ చేస్తున్నట్లు ఆ క్రికెటర్‌ తెలిపాడు. ప్రస్తుతం వైరస్‌ అదుపులో లేని కారణంగా మనమే జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయాన్ని ఆ ప్లేయర్‌ వినిపించాడు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికే పలు క్రికెట్‌ టోర్నీలు రద్దు అయ్యాయి. జూన్‌లో శ్రీలంకతో జరగాల్సి వన్డే సిరీస్‌ను కూడా రద్దు చేశారు. కొత్తగా ఏదైనా క్రికెట్‌ సిరీస్‌ ఆడాలంటే, కనీసం రెండు వారాల పాటు శిక్షణ అవసరమని కోహ్లీ సేన అభిప్రాయపడింది. చాలా రోజుల తర్వాత బ్యాట్‌ పట్టాల్సి వస్తుందని, ఆ సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలాంటప్పుడు కాస్త శిక్షణ అవసరమని బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.

మరీ ఎక్కువ కాలం శిక్షణ కాకుండా కొన్ని రోజులైన ప్రాక్టీస్ చేస్తే మంచిదని అయ్యర్‌ అన్నాడు. ఇతర క్రికెటర్లు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్త పరిచారు. వాస్తవానికి ఈనెల 24వ తేదీన శ్రీలంక టూర్‌కు ఇండియా వెళ్లాల్సి ఉన్నది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఇక జింబాబ్వే పర్యటనలో జరగాల్సిన మూడు వన్డేలను కూడా రద్దు చేశారు.

outdoor cricket,practice,permission,from bcci,players ,బీసీసీఐ, నుంచి అనుమతి ,వచ్చిన, తర్వాతనే ఔట్‌డోర్‌, క్రికెట్‌ ప్రాక్టీస్‌


అయితే టీమిండియా క్రికెటర్లకు క్యాంపు నిర్వహించాల్సిన అంశంపై బీసీసీఐ గౌరవ కార్యదర్శి జేయ్‌ షా స్పందించారు. ఔట్‌డోర్‌లో శిక్షణకు అనువైన వాతావరణం ఏర్పడిన తర్వాతనే క్యాంపును నిర్వహించనున్నట్లు ఆయన మరోసారి స్పష్టం చేశారు. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌ సిరీస్‌లను పునరుద్దరించేందుకు బీసీసీఐ ఆసక్తితో ఉన్నదని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను తీసుకోబోమన్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచలను ఆఫీసు బేరర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, కేంద్రం జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను ఫాలో అయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని షా తెలిపారు. పరిస్థితులను అధ్యయనం చేసి బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Tags :

Advertisement