Advertisement

  • నాన్ బోర్డర్లు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలి... ఓయూ హెచ్చరిక

నాన్ బోర్డర్లు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలి... ఓయూ హెచ్చరిక

By: Sankar Fri, 18 Dec 2020 9:54 PM

నాన్ బోర్డర్లు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలి... ఓయూ హెచ్చరిక


వర్సిటీ హాస్టళ్లలో అనధికారికంగా ఉంటున్న వ్య‌క్తులు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ అధికార వర్గాలు శుక్రవారం హెచ్చరించాయి.

లేనిఎడల అక్రమ చొరబాటుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంది. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి యూనివర్సిటీ క్యాంపస్‌ ఆవరణలోని అన్ని హాస్టళ్లను మూసివేసింది. అదేవిధంగా విద్యుత్‌, నీటి సరఫరాను నిలిపివేసింది. అయినప్పటికీ ఇటీవల కొంతమంది విద్యార్థుల ముసుగులో హాస్టల్‌ రూంల్లో అనధికారికంగా చొరబడినట్లు తమ నోటీసుకు వచ్చిందన్నారు.

విద్యుత్‌, నీటి సరఫరా లేనప్పటికీ వీరు అక్రమంగా హాస్టళ్లలో ఉంటున్నారంది. దీని వల్లే యూనివర్సిటీలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఉత్పన్నమౌతున్నట్లు పేర్కొంది. అనధికారికంగా ఉంటున్న ఇటువంటి వారిపై వర్సిటీ సీరియస్‌ యాక్షన్‌ తీసుకోనున్నట్లు హెచ్చరించింది.

Tags :
|
|

Advertisement