Advertisement

  • సీపీజీఈటీ-2020 కోసం కొత్త తేదీల షెడ్యూల్‌ విడుదల చేసిన ఉస్మానియా...

సీపీజీఈటీ-2020 కోసం కొత్త తేదీల షెడ్యూల్‌ విడుదల చేసిన ఉస్మానియా...

By: chandrasekar Thu, 05 Nov 2020 4:20 PM

సీపీజీఈటీ-2020 కోసం కొత్త తేదీల షెడ్యూల్‌ విడుదల చేసిన ఉస్మానియా...


ఉస్మానియా యూనివర్సిటీ సీపీజీఈటీ-2020 కోసం కొత్త తేదీల షెడ్యూల్‌ విడుదలైంది. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ Tscpget.com లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.

ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, పీజీ డిప్లొమా కోర్సులతోపాటు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంల ప్రవేశాల పరీక్షలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు నిర్వహించాల్సి ఉంది. కరోనా‌ వ్యాప్తి, భారీ వర్షాల, వరదల కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గాను 2020-2021 విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమురు, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాలు అందించే డిప్లొమా కోర్సులు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ) రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ) 2020 నిర్వహిస్తున్నది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 న ప్రారంభమై అక్టోబర్ 19 తో ముగిసింది.

కరోనా వైరస్ సంక్రమణతోపాటు తెలంగాణలో భారీగా వర్షాలు కురువడం, వరదలు రావడంతో సీపీజీఈటీ-2020 కు హాజరయ్యే అభ్యర్థుల కోసం మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఓయూ తన ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు రూ.500 ఆలస్య రుసుం చెల్లించి నవంబర్ 17 వరకు, రూ.2,000 ఆలస్య రుసుం చెల్లించడం ద్వారా నవంబర్ 21 వరకు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి షెడ్యూల్ కూడా త్వరలో యూనివర్శిటీ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Tags :

Advertisement