Advertisement

  • కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పొందాలంటే భారత్‌లోని సామాన్యులు 2022 వరకూ ఆగాల్సిందే

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పొందాలంటే భారత్‌లోని సామాన్యులు 2022 వరకూ ఆగాల్సిందే

By: chandrasekar Mon, 09 Nov 2020 3:09 PM

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పొందాలంటే భారత్‌లోని సామాన్యులు 2022 వరకూ ఆగాల్సిందే


ప్రపంచమే కరోనా వైరస్ వల్ల చాలా నష్టాలను ఎదుర్కొంటు వుంది. వాక్సిన్ తయారీ ఇప్పటికి ట్రయల్స్ దశలోనే వుంది. ఇది ట్రయల్స్ ముగించి ఉత్పత్తి ప్రారంభించిన తరువాత కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పొందాలంటే భారత్‌లోని సామాన్యులు 2022 వరకూ ఆగాల్సిందే అంటున్నారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా. వ్యాక్సిన్‌ తయారైనప్పటికీ భారత మార్కెట్లలో దొరకాలంటే కనీసం ఏడాది కాలం కచ్చితంగా పడుతుందని ఒక వార్తాసంస్థకు ఇచ్చి న ఇంటర్వ్యూలో ఆయన తాజాగా పేర్కొన్నారు.

వాక్సిన్ ఎప్పుడు రెడీ అవుతుందో ఇప్పుడే చెప్పలేము. మన దేశంలో జనాభా చాలా ఎక్కువ. మార్కెట్‌లో కరోనా వ్యాక్సిన్‌ ఎప్పటికి దొరుకుతుందో తెలియాలంటే వేచి చూడాలి. భారత్‌లోని ప్రతీ ప్రాంతానికి వ్యాక్సిన్‌ చేరేలా పంపిణీ ఉండాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. అయితే ఇదే మన దగ్గర అతి పెద్ద సవాలు. ఒకవేళ ఆ వ్యాక్సిన్‌కంటే శక్తివంతమైన మరో వ్యాక్సిన్‌ ఆ తర్వాత కనిపెడితే అందుకు ఏ విధంగా స్పందించాలన్నది రెండో సవాలు.

దేశంలో అందరికి కావలసినంత ఉత్పత్తి చేయాలి. అంతేకాదు వ్యాక్సిన్‌ వచ్చినంత మాత్రాన వైరస్‌ పోతుందని అనుకోకూడదు అని ఆయన పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో సాయం చేస్తామని భారత్‌ ప్రపంచదేశాలకు హామీ ఇచ్చింది. వివిధ దేశాలకు చెందిన 190మంది ప్రతినిధులకు విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్‌ శ్రింగాలా ఈ మేరకు తెలిపారు. మరి ఎప్పుడు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందో!

Tags :
|

Advertisement