Advertisement

  • ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అక్క‌డి ప్రభుత్వం ఫై డిమాండ్‌

ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అక్క‌డి ప్రభుత్వం ఫై డిమాండ్‌

By: chandrasekar Fri, 26 June 2020 12:52 PM

ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అక్క‌డి ప్రభుత్వం ఫై డిమాండ్‌


చైనా నేపాల్‌ భూభాగాన్నిఆక్రమించిందంటూ వ‌స్తున్న‌ వార్తలపై ఆ దేశ రాజ‌కీయాలు వేడెక్కాయి. చైనా ఆక్ర‌మ‌ణ‌ల‌పై సమాధానం చెప్పి తీరాల‌ని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అక్క‌డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

ఈ మేర‌కు నేపాలీ కాంగ్రెస్ సభ్యులు దేవేంద్ర రాజ్‌ కండేల్‌, సత్య నారాయణ్‌ శర్మ ఖనాల్‌, సంజయ కుమార్‌ గౌతం పార్లమెంటు దిగువసభలో బుధవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేపాల్‌ భూభాగంలోని డోలఖ, హమ్లా, సింధుపాల్ చౌక్‌, సంఖువాసభ, గోర్ఖా, రసువా జిల్లాల్లో దాదాపు 64 హెక్టార్లను చైనా ఆక్రమించిందని, చైనా టిబెట్‌ రీజియన్‌ సమీపంలో ఉత్తర గోర్ఖాలోని రూయీ గ్రామం సరిహద్దు వద్దగల పిల్లర్‌ 35ని ముందుకు జరిపార‌ని, దాంతో రూయీలోని 72 కుటుంబాలు, దార్చౌలాలోని 18 ఇండ్లు చైనా భూభాగంలోకి వెళ్లిపోయాయ‌ని తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై చర్చ జరిపి వివరణ ఇవ్వాలన్నారు.

వాస్తవాలేమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చైనాతో నేపాల్‌ దాదాపు 1,41,488 చదరపు కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా చైనాతో మరింత స్నేహంగా మెలుగుతున్న నేపాల్‌కు డ్రాగన్‌ ఇటీవల గట్టి షాకిచ్చింది.

టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్‌ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని చైనా ఆక్ర‌మించింద‌ని నేపాల్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం నివేదిక వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి నేపాల్‌లోని 10 ప్రాంతాలను డ్రాగన్‌ ఆక్రమించిందని ఆ సర్వే పేర్కొంది. అయితే ఈ విషయంపై కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇంతవరకు నోరు మెదపడంలేదు. ప్ర‌తిప‌క్షాలు ఎంత డిమాండ్ చేసినా స‌మాధానం చెప్ప‌డంలేదు.

Tags :
|

Advertisement