Advertisement

  • ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు

ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు

By: chandrasekar Tue, 14 July 2020 6:21 PM

ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు


ఢిల్లీలో ఒకటి లేదా రెండు రోజుల నోటీస్ వ్యవధిలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 60 రోజులుగా నిలిచిపోయిన ప్రయాణాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే విమాన ప్రయాణాలు ప్రారంభం కాగా, ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

24 నుండి 48 గంటల నోటీసులో ప్రయాణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డి‌ఎం‌ఆర్‌సి) కూడా సిద్ధంగా ఉంది. రైళ్ల ఫ్రీక్వెన్సీను అధికంగా ఉంచడానికి ఢిల్లీలోని అన్ని లైన్లలో కార్యకలాపాలను నిర్వహించేందుకు డి‌ఎం‌ఆర్‌సి సిబ్బందితో సిద్ధంగా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.

ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేయడానికి డి‌ఎం‌ఆర్‌సి మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాల వద్ద 'కస్టమర్ ఫెసిలిటేషన్ ఏజెంట్లను' ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. డి‌ఎం‌ఆర్‌సి యొక్క ప్రామాణిక నిర్వహణ విధానాల ప్రకారం కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే మెట్రో స్టేషన్లలోకి అనుమతించనున్నారు.

కరోనా వైరస్ నెగిటివ్ ఉన్న ప్రయాణికులకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ తో అనుసంధానించబడి ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారిత టికెట్లను మంజూరు చేస్తారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించాలనుకునే వారంతా తప్పని సరిగా వారి మొబైల్ ఫోన్ లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. అసాధారణమైన పరిస్థితులలో తప్ప నగదు లావాదేవీలను ప్రోత్సహించడ జరగదని, మెట్రో వద్ద టోకెన్ వెండింగ్ యంత్రాలు కూడా నిలిపివేయబడతాయని వార్తలు ఉన్నాయి.

ఢిల్లీ మెట్రో స్టేషన్ల శుభ్రం కోసం ఇప్పటికే హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించినట్లు వార్తలు వచ్చాయి. డి‌ఎం‌ఆర్‌సి యొక్క కస్టమర్ రిలేషన్ సిబ్బందికి కూడా మెట్రో సేవలకు సంబంధించి కొత్త ప్రామాణిక నిర్వహణ విధానం గురించి సవివరంగా తెలియజేసినట్లు సమాచారం.

అలాగే సర్వీసులను పునః ప్రారంభించిన మొదటి రోజున గరిష్ట సామర్ధ్యంతో మెట్రో రైళ్లు నడుస్తాయని నివేదికలు చెబుతున్నాయి. నిర్వహణ సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఈ ఆలోచనను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. మెట్రో కార్యకలాపాలను పునః ప్రారంభించడంపై ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు లేవని డి‌ఎం‌ఆర్‌సి అధికారి మీడియాకు తెలిపారు. అయితే మెట్రో సర్వీసుల ప్రారంభానికి సంబంధించి అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను మాత్రం కేంద్రం మెట్రో రైలు ఆపరేటర్లతో పంచుకున్నట్లు తెలుస్తుంది.

ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండేలా మెట్రో రైళ్లు ప్రతి స్టేషన్ లో అదనంగా 30 సెకన్ల పాటు నిలిచి ఉండాలని ఎస్‌ఓ‌పి పేర్కొంది. రైళ్ల లోపల ప్రతి ప్రత్యామ్నాయ సీటుపై ఒక స్టిక్కర్ అతికించి ఉంటుంది. వాటిలో ప్రయాణికులు కూర్చోకూడదు. అలాగే రైలు లోపల నిలబడి ఉండే ప్రయాణికులు ఒక మీటరు దూరం పాటించాల్సి ఉంటుంది.

Tags :
|
|

Advertisement