Advertisement

  • 125W ఫ్లాష్‌ ఛార్జర్‌ను తీసుకురానున్న ఒప్పో....20 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్

125W ఫ్లాష్‌ ఛార్జర్‌ను తీసుకురానున్న ఒప్పో....20 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్

By: chandrasekar Thu, 16 July 2020 5:00 PM

125W ఫ్లాష్‌ ఛార్జర్‌ను తీసుకురానున్న ఒప్పో....20 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో కొత్త ఛార్జర్ ప్రవేశపెట్టింది. నూతన సాంకేతికతతో అభివృద్ధి చేసిన 125W ఫ్లాష్‌ ఛార్జర్‌ను త్వరలోనే ఒప్పో స్మార్ట్‌ఫోన్లతో పాటు తీసుకురానుంది.

ఒప్పో రెనో 5, ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 3 సిరీస్‌లతో ఫ్లాష్‌ ఛార్జర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. ఒప్పో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఛార్జర్ ద్వారా 4,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్‌ను కేవలం 20 నిమిషాల్లోనే ఫుల్(100% ) ఛార్జింగ్ చేసుకోవచ్చు.

కేవలం ఐదు నిమిషాల్లోనే జీరో నుంచి 41 శాతం వరకు ఛార్జింగ్‌ చేయగలదు. చాలా కంపెనీలు విడుదల చేస్తున్న ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ కెపాసిటీ 3,000mAh కన్నా ఎక్కువగా ఉంటున్నది. మరోవైపు 65w వైర్‌లెస్‌ ఛార్జర్‌ ద్వారా కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ఛార్జింగ్‌ చేయవచ్చని ఒప్పో పేర్కొంది.

Tags :
|

Advertisement