Advertisement

  • స్మార్ట్‌టీవీని టీజ్ చేసిన ఒప్పో.. అదిరిపోయే డిస్‌ప్లేతో ఎంట్రీ..,

స్మార్ట్‌టీవీని టీజ్ చేసిన ఒప్పో.. అదిరిపోయే డిస్‌ప్లేతో ఎంట్రీ..,

By: chandrasekar Thu, 01 Oct 2020 12:09 PM

స్మార్ట్‌టీవీని టీజ్ చేసిన ఒప్పో.. అదిరిపోయే డిస్‌ప్లేతో ఎంట్రీ..,


ఒప్పో తన మొట్టమొదటి టీవీ టీజర్‌ను ఒప్పో వీబోలో లాంచ్ చేసింది. ఈ టీజర్ వీడియోలో రానున్న కొత్త టీవీకి సంబంధించిన డిజైన్‌ను చూడవచ్చు. ఈ వీడియో 8కే రా భాగస్వామ్యంతో రూపొందించారు. అయితే 4కే రిజల్యూషన్‌లో 120 ఎఫ్‌పీఎస్ వేగంతో ఇది అందుబాటులో ఉంది.లాంచ్ అయిన టీజర్ ప్రకారం ఒప్పో టీవీలో సన్నని అంచులు ఉండనున్నాయి. కింద భాగంలో ఒప్పో బ్రాండ్ లోగోను చూడవచ్చు. దీంతోపాటు ఈ టీవీలో పాపప్-కెమెరా ఉండనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. దీన్ని వీడియో కాలింగ్, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ కలిగి ఉన్న ప్రముఖ టిప్ స్టర్ దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా లీక్ చేశారు. దాని ప్రకారం ఈ టీవీ రెండు స్క్రీన్ సైజుల్లో రానుంది. 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో ఈ టీవీ లాంచ్ కానుందని అతను పేర్కొన్నారు. దీంతో పాటు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న క్వాంటం డాట్ డిస్ ప్లే కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

Tags :
|
|
|

Advertisement