Advertisement

  • పాపప్ కెమెరాతో రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేయనున్న ఒప్పో సంస్థ...

పాపప్ కెమెరాతో రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేయనున్న ఒప్పో సంస్థ...

By: chandrasekar Tue, 13 Oct 2020 4:25 PM

పాపప్ కెమెరాతో రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేయనున్న ఒప్పో సంస్థ...


న్యూఢిల్లీ: రెండుస్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అయింది చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో. ఈ మేరకు చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వీబో టీజర్‌ను పోస్టు చేసింది. ఈ టీజర్‌లో సైజుకు సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. అయితే, ఇవి 55, 65 అంగుళాల స్క్రీన్ సైజుల్లో వచ్చే అవకాశం ఉందని కంపల్సరీ సర్టిఫికేషన్ ఆఫ్ చైనాలో లిస్టింగును బట్టి తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఈ టీవీల్లో పాపప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం.

ఈ నెల 19న చైనాలో ఈ స్మార్ట్ టీవీలు లాంచ్ కానున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఒప్పో నుంచి మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ ఒప్పో ఆన్‌లైన్ రిటైల్ పార్ట్‌నర్ జేడీ డాట్ కామ్ మాత్రం 55, 65 అంగుళాల సైజుల్లో స్మార్ట్‌టీవీలు లాంచ్ కానున్నట్టు నిర్ధారించింది. ఒప్పో స్మార్ట్ టీవీ ఆర్1 55, ఒప్పో స్మార్ట్ టీవీ ఎస్1 65 పేర్లతో ఇవి మార్కెట్లోకి రానున్నట్టు సమాచారం. ఒప్పో స్మార్ట్ టీవీ క్వాంటమ్ డాట్ డిస్‌ప్లే ప్యానెల్‌, 4కె రిజల్యూషన్‌,120 హెర్ట్‌జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నట్టు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే, ఇందులో ఉపయోగించిన స్పీకర్లు కూడా శక్తిమంతమైనవని చెబుతున్నారు. ఇక, ఒప్పో సోదర సంస్థ అయిన రియల్‌మి ఇప్పటికే స్మార్ట్‌టీవీ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 32, 43 అంగుళాల ఆండ్రాయిడ్ ఆధారిత టీవీలను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 12,999 మాత్రమే.

Tags :
|

Advertisement