Advertisement

  • బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చిన ఓపెనర్‌ పృథ్వీ

బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చిన ఓపెనర్‌ పృథ్వీ

By: chandrasekar Sat, 26 Sept 2020 11:17 AM

బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చిన ఓపెనర్‌ పృథ్వీ


చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్‌ పృథ్వీ షా(64 43 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకంతో రాణించాడు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(35), రిషభ్‌ పంత్‌(37 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌(26) కీలక ప్రదర్శన చేశారు. చెన్నై బౌలర్లలో పియూశ్‌ చావ్లా ఒక్కడే రెండు వికెట్లు తీయగా శామ్‌ కరన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. పృథ్వీ షా, ధావన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆరంభంలో ఓపెనింగ్‌ జోడీ చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శన చేశారు.

ఈ క్రమంలోనే షా 35 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ధావన్‌ సహకారం అందిస్తుండటంతో షా చెలరేగిపోయాడు. 10 ఓవర్లకే ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. చావ్లా బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరగడంతో 94 పరుగుల తొలి భాగస్వామ్యానికి తెరపడింది. మిడిల్‌ ఓవర్లలో చెన్నై బౌలర్లు ధాటిగా బంతులేశారు. కట్టుదిట్టమైన బంతులతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నారు. ఆరంభంలో ఢిల్లీ జోరు చూస్తే స్కోరు 200 దాటేలా కనిపించినా గట్టిగా పుంజుకున్న చెన్నై ప్రత్యర్థి స్కోరు వేగానికి కళ్లెం వేసింది. ఆఖర్లో భారీ హిట్టింగ్‌ చేయాలని ఢిల్లీ ప్రయత్నించినా..ధోనీ వారి వ్యూహాలకు చెక్‌ పెట్టాడు.

Tags :
|
|

Advertisement