Advertisement

  • గాయం కారణంగా వైదొలగిన ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్

గాయం కారణంగా వైదొలగిన ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్

By: chandrasekar Tue, 01 Dec 2020 12:03 PM

గాయం కారణంగా వైదొలగిన ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్


ఇండియాపై వరుస విజయాలతో దూసుకెళుతున్న ఆస్ట్రేలియా కు ఎదురు దెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ విరోచితంగా ఆడటం వల్ల సునాయాసంగా బారి స్కోర్ ను ఆస్ట్రేలియా సాధిస్తూ వుంది. టీమిండియాపై వ‌రుస‌గా రెండు వ‌న్డేలు గెలిచి సిరీస్ ఎగురేసుకుపోయిన ఆస్ట్రేలియాకు షాక్ త‌గిలింది. టాప్ ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ గాయం కార‌ణంగా మూడో వ‌న్డేతోపాటు టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. టెస్ట్ సిరీస్‌కు కూడా అత‌డు అందుబాటులో ఉండేది అనుమాన‌మే.

ఇండియా తో జరిగిన రెండో వ‌న్డేలో ఫీల్డింగ్ చేస్తూ వార్న‌ర్ గాయ‌ప‌డ్డాడు. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో డైవ్ చేసి ఓ బంతిని ఆపే స‌మ‌యంలో అత‌నికి గ‌జ్జ‌ల్లో గాయ‌మైంది. నొప్పితో విల‌విల్లాడుతూ అత‌డు అప్పుడే మైదానాన్ని వీడాడు. ఆ వెంట‌నే అత‌న్ని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డం క‌నిపించింది. వార్న‌ర్ స‌రిగా న‌డ‌వ‌డానికి కూడా ఇబ్బంది ప‌డ‌టం వీడియోల్లో కనిపించింది. దీనిని చూస్తే అతనికి తీవ్రంగానే గాయాలైనట్లు తెలుస్తుంది.

గాయం కారణంగా అత‌నికి మూడో వ‌న్డేతోపాటు, టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. రెండు వ‌న్డేల్లోనూ వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీలు చేశాడు. కెప్టెన్ ఫించ్‌తో క‌లిసి రెండు సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్‌లు నెల‌కొల్పాడు. మ‌రోవైపు స్టార్ బౌల‌ర్ ప్యాట్ క‌మిన్స్‌కు కూడా మిగ‌తా ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతినిచ్చింది. టెస్ట్ సిరీస్‌కు అత‌డు పూర్తి ఫిట్‌గా వుంది సేవలందించడానికి ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడైనా ఇండియా మిగిలిన మ్యాచ్లలో ఆస్ట్రేలియా ను కట్టడి చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Tags :
|
|
|

Advertisement