Advertisement

ఈ సారి అంచనాలకు మించి ఆన్‌లైన్ విక్రయాలు

By: chandrasekar Sat, 28 Nov 2020 3:05 PM

ఈ సారి అంచనాలకు మించి ఆన్‌లైన్ విక్రయాలు


ఈ సారి అంచనాలకు మించి ఆన్‌లైన్ విక్రయాలు జరిగాయి. దేశీయ ఈ-కామర్స్‌ పండుగ అమ్మకాలు ఈసారి పెద్ద ఎత్తున జరిగాయి. గత నెల 15 నుంచి ఈ నెల 15 వరకు ఆన్‌లైన్‌ సంస్థల స్థూల విక్రయాలు దాదాపు రూ.58వేల కోట్లు (8.3 బిలియన్‌ డాలర్లు)గా ఉన్నాయని రిసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ శుక్రవారం తెలిపింది. నిజానికి పండుగ సీజన్‌కు ముందు 7 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని రెడ్‌సీర్‌ అంచనా వేసింది.

ప్రస్తుత విక్రయాలు పోయిన సారి అలాగే గతేడాది ఇదే వ్యవధిలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ రూ.35వేల కోట్లుగానే ఉందని పేర్కొన్నది. దీంతో ఈ ఏడాది 65 శాతం అమ్మకాలు పుంజుకున్నైట్లెంది. ‘ది ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫస్ట్స్‌' పేరుతో రెడ్‌సీర్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.22వేల కోట్ల విక్రయాలు జరిగినట్లు వెల్లడించింది. పండుగ సీజన్‌లో సేల్స్‌ రెట్టింపునకుపైగా ఎగబాకాయని తెలిపింది.

దేశంలో ఆర్ధిక స్థితి మందగించడం వల్ల మరియు కరోనా ప్రభావం ఉన్నా ఈసారి అమ్మకాలు నిరుడు కంటే, ముఖ్యంగా అంచనాలకు మించి నమోదు కావడం గమనార్హం అని ఈ సందర్భంగా రెడ్‌సీర్‌ డైరెక్టర్‌ మ్రిగ్నక్‌ గుట్గుటియా అన్నారు. కాగా, దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ఈ-కామర్స్‌ సంస్థలు మెగా సేల్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. చాలా మందికి ఆన్ లైన్ విక్రయాలపై మక్కువ కలిగినట్లు తెలుస్తుంది.

Tags :
|
|

Advertisement