Advertisement

  • వైష్ణోదేవి యాత్రకు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించిన దేవాలయ సీఈఓ

వైష్ణోదేవి యాత్రకు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించిన దేవాలయ సీఈఓ

By: Sankar Tue, 25 Aug 2020 1:00 PM

వైష్ణోదేవి యాత్రకు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించిన దేవాలయ సీఈఓ


జ‌మ్మూక‌శ్మీర్‌లోని కాట్రాలో ఉన్న వైష్ణవోదేవి ఆల‌యం సంద‌ర్శించే భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. దేవీ ద‌ర్శ‌నం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, హెలికాప్ట‌ర్ బుకింగ్ సౌక‌ర్యాల‌ను ప్రారంభిస్తున్నారు. ఆగ‌స్టు 26 నుంచి సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు భ‌క్తుల‌కు ఆన్‌లైన్ యాత్రా రిజిస్ట్రేష‌న్ అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు సీఈవో ర‌మేశ్ కుమార్ తెలిపారు.

కోవిడ్‌19 నేప‌థ్యంలో వైష్ణ‌వోదేవి యాత్ర‌ను మార్చిలో నిలిపేశారు. ఆగ‌స్టు 16వ తేదీన యాత్ర‌ను పున‌ర్ ప్రారంభించారు. కోవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ ఉంటేనే ఆల‌యంలోకి భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పిస్తామ‌ని ఈవో తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే భ‌క్తులు నెగ‌టివ్ రిపోర్ట్ తీసుకురావాల‌ని, ప్ర‌యాణానికి 48 గంట‌ల ముందు తీసిన రిపోర్ట్ ఉండాల‌ని ఈవో చెప్పారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఉన్న భ‌క్తుల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పిస్తామ‌న్నారు.

60 ఏళ్లు దాటిన వృద్ధుల‌కే, ప‌దేళ్ల‌లోపు చిన్నారుల‌కు, గ‌ర్భిణుల‌కు, వ్యాధులు ఉన్న‌వారికి ఆల‌య ప్ర‌వేశం ఉండ‌దు అని ర‌మేశ్ చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌తి రోజూ రెండు వేల మంది భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పిస్తున్నారు. దాంట్లో 1900 మంది స్థానికులు కాగా, వంద మంది మాత్రమే ఇత‌ర ప్రాంత భక్తుల‌ను రానిస్తున్నారు. ఇత‌ర రాష్ట్ర భ‌క్తుల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్లు ఈవో చెప్పారు.


Tags :
|
|

Advertisement