Advertisement

  • కస్టమర్లకు ఇబ్బందిగా మారిన ఆన్ లైన్ పేమెంట్స్...

కస్టమర్లకు ఇబ్బందిగా మారిన ఆన్ లైన్ పేమెంట్స్...

By: chandrasekar Wed, 16 Dec 2020 9:21 PM

కస్టమర్లకు ఇబ్బందిగా మారిన ఆన్ లైన్ పేమెంట్స్...


డిజిటల్ పేమెంట్లను ప్రమోట్ చేయాలని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ట్రాన్సాక్షన్ చేస్తుండగానే యాప్ స్ట్రక్ అవడంతో లేదా వేరే ఏదో ఒక కారణం వల్లనో పేమెంట్ జరగడం లేదు. కానీ డబ్బులు మాత్రం అకౌంట్ నుంచి కట్ అవుతున్నాయి. ఫోన్ నెట్‌‌వర్క్ ప్రాబ్లెమ్ లేదా యాప్‌‌ సమస్యనా అనేది చాలామందికి తెలియడం లేదు. ఏటీఎంలు కూడా అలాగే తయారైయ్యాయి.నవంబర్‌‌‌‌లో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ డిజిటల్ సర్వీసులు నాలుగు గంటల పాటు ఆగిపోయాయి. డిజిటల్ సేవల్లో సమస్యలు రావటంతో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ చర్యలు కూడా తీసుకుంది. ఎస్‌‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనోలో కూడా సమస్యలు వస్తున్నాయి. అసలెందుకు ఇలా జరిగిందో అర్థం కాక కస్టమర్లు తలపట్టుకుంటున్నారు.

బ్యాంక్‌‌లు ఐటీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను మెరుగుపర్చుకోవాలని ఆర్‌‌‌‌బీఐ పదేపదే సూచిస్తూనే ఉంది. బ్యాంక్‌‌ల డేటా సెంటర్లను థర్డ్ పార్టీలు మేనేజ్‌‌ చేస్తున్నారు. పదే పదే పవర్‌‌‌‌ ఫెయిల్యూర్స్‌‌తో డిజిటల్ సర్వీస్‌‌లలో ఇష్యూస్‌‌ వస్తున్నాయని బ్యాంక్‌‌లు చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ కొత్త డిజిటల్ బ్యాంకింగ్ యాప్ కూడా ఫెయిల్ అయ్యింది. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ గార్టనర్ అంచనా ప్రకారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌‌ల ఐటీ ఖర్చు, డేటా సెంటర్లపై ఎక్స్‌‌పెండించర్ 2020లో 2 శాతం తగ్గింది. కరోనా మహమ్మారి సమయంలో చాలా బ్యాంక్‌‌లకు డిజిటల్ కస్టమర్లు పెరిగారు. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌‌ల కస్టమర్లలో 50 శాతం మంది డిజిటల్‌‌గా వచ్చారు. కానీ ఇటీవల హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ కొత్త డిజిటల్ సర్వీసులు తేవొద్దని ఆంక్షలు విధించడంతో ఈ బ్యాంక్‌‌కు కాస్త ఇబ్బందికరంగానే మారింది. ప్రతి నెలా 3 లక్షల మంది కొత్త క్రెడిట్ కార్డు కస్టమర్లను ఇది కోల్పోతుంది. చాలా బ్యాంకులు క్లౌడ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ను అందిపుచ్చుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీలను తప్పనిసరిగా అందుబాటులోకి బ్యాంకులు తెచ్చుకోవల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Tags :
|

Advertisement