Advertisement

  • శబరిమల వెళ్లే భక్తులకు ఆన్‌లైన్ దర్శన టికెట్ల బుకింగ్ ప్రారంభం...

శబరిమల వెళ్లే భక్తులకు ఆన్‌లైన్ దర్శన టికెట్ల బుకింగ్ ప్రారంభం...

By: chandrasekar Wed, 23 Dec 2020 5:04 PM

శబరిమల వెళ్లే భక్తులకు ఆన్‌లైన్ దర్శన టికెట్ల బుకింగ్ ప్రారంభం...


శబరిమల వెళ్లే ట్రావెన్కోర్ దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఆన్‌లైన్ దర్శన టికెట్ల బుకింగ్ ను ప్రారంభించింది. అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించేవారు తప్పనిసరిగా తమ వెంట కరోనా నెగటివ్ టెస్ట్ రిపోర్టును తీసుకురావాలని సూచించింది. డిసెంబర్ 26వ తేదీ నుంచి శబరిమల దర్శనం ప్రారంభమవుతోంది. ప్రతి ఏటా డిసెంబరు 26న మండలపూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహించిన తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు.

ప్రతీ రోజూ 5000 మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తూ ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేశారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరై అయ్యప్ప దర్శనానికి వస్తారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలు పాటు శబరిమల ఆలయాన్ని మూసేశారు. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత అక్టోబర్ లో భక్తుల కోసం తిరిగి ఆలయాన్ని తెరిచారు. 5 వేల మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

Tags :
|

Advertisement