Advertisement

  • వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్...సూపర్ ఫీచర్లతో...

వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్...సూపర్ ఫీచర్లతో...

By: chandrasekar Tue, 27 Oct 2020 03:22 AM

వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్...సూపర్ ఫీచర్లతో...


వన్ ప్లస్ నార్డ్ సిరీస్‌లో భాగంగా వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ వన్ ప్లస్ 8టీకి కాస్త దగ్గరగా ఉంది. ఈ ఫోన్‌లో 5జీ సపోర్ట్ అందించారు. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, స్టీరియో స్పీకర్ అందుబాటులో ఉంది.

వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ ధర మరియు స్పెసిఫికేషన్లు;

దీనిలో ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ధరను 329 యూరోలుగా(సుమారు రూ.32,000) నిర్ణయించారు.

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మిడ్ నైట్ ఐస్ రంగులో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మొదటగా దీనిని యూరోప్‌లో లాంచ్ చేసారు.

మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయని మాత్రం తెలియరాలేదు. ఇందులో 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు.

స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10.5పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్‌గా ఉంది.

దీంతోపాటు మాక్రో, మోనోక్రోమ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉంది.

వార్ప్ చార్జ్ 30టీ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో అందించారు.

Tags :
|
|

Advertisement