Advertisement

  • అక్టోబర్ 14వ తేదీన లాంచ్ కానున్న వన్ ప్లస్ 8టీ సిరీస్ ఫోన్లు

అక్టోబర్ 14వ తేదీన లాంచ్ కానున్న వన్ ప్లస్ 8టీ సిరీస్ ఫోన్లు

By: chandrasekar Tue, 22 Sept 2020 7:32 PM

అక్టోబర్ 14వ తేదీన లాంచ్ కానున్న వన్ ప్లస్ 8టీ సిరీస్ ఫోన్లు


వన్ ప్లస్ 8టీ సిరీస్ ఫోన్లు అక్టోబర్ 14వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన ధరలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అయితే ఇవి మనదేశ ధరలు కాదు. అంతర్జాతీయ ధరలు మాత్రమే. ప్రముఖ టిప్‌స్టర్ చున్ దీనికి సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. వన్ ప్లస్ 8టీ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 799 యూరోలుగానూ (సుమారు రూ.61,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 899 యూరోలుగానూ(సుమారు రూ.77,000) ఉందని తెలిపారు. ఒకవేళ మనదేశ వేరియంట్‌కు కూడా ఇవే ధరలు నిర్ణయిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్ల కంటే ఇది ఎంతో ఎక్కువ అని చెప్పవచ్చు. వన్ ప్లస్.. 2013లో తన మొదటి ఫోన్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి వన్‌ప్లస్ తన ఫోన్ల ధరను పెంచుతూనే ఉంది. కాబట్టి వన్ ప్లస్ 8/8 ప్రో కంటే ఈ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వన్ ప్లస్ 8టీ స్పెసిఫికేషన్లు

దీనిలో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించే అవకాశం ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. దీనిలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865+ ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండే అవకాశం ఉంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతోపాటు 16 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండే అవకాశం ఉంది. 45000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో కంపెనీ లాంచ్ చేసే మొదటి ఫోన్ ఇదే కానుంది.

Tags :

Advertisement