Advertisement

  • యూ-సిరీస్, వై-సిరీస్ లో బడ్జెట్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన వన్ ప్లస్

యూ-సిరీస్, వై-సిరీస్ లో బడ్జెట్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన వన్ ప్లస్

By: chandrasekar Fri, 03 July 2020 3:49 PM

యూ-సిరీస్, వై-సిరీస్ లో బడ్జెట్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన వన్ ప్లస్


వన్ ప్లస్ బడ్జెట్ స్మార్ట్ టీవీలను యూ-సిరీస్, వై-సిరీస్ లో లాంచ్ చేశారు. వై-సిరీస్ టీవీ ధరలు రూ.12,999 నుంచి ప్రారంభం అయ్యాయి. యూ-సిరీస్ టీవీ ధర రూ.49,999గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ 9 Pie ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయి. వన్ ప్లస్ ఫోన్ల కంటే తక్కువ ధరలో వీటిలో రెండు టీవీలు ఉండటం విశేషం.

వన్ ప్లస్ యూ-సిరీస్ లో 32 అంగుళాల టీవీ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఇందులోనే 43 అంగుళాల టీవీ ధర రూ.22,999గా ఉంది. 55 అంగుళాల అల్ట్రా హెచ్ డీ టీవీ ధరను రూ.49,999గా నిర్ణయించారు. గతంలో లాంచ్ అయిన వన్ ప్లస్ టీవీ క్యూ1 కూడా 55 అంగుళాల టీవీనే కానీ దాని ధర మాత్రం రూ.69,999గా ఉంది. వన్ ప్లస్ కొత్త టీవీల సేల్ జులై 5వ తేదీ నుంచి అమెజాన్ లో జరగనుంది.

ఇవి త్వరలో వన్ ప్లస్ ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ లో కూడా లభించనున్నాయి. వన్ ప్లస్ వై-సిరీస్ టీవీలు 32, 43 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 32 అంగుళాల టీవీలో హెచ్ డీ, స్క్రీన్ ను అందించగా, 43 అంగుళాల టీవీలో ఫుల్ హెచ్ డీ స్క్రీన్ ను అందించారు. ఇందులో ఆక్సిజన్ ప్లే, వన్ ప్లస్ కనెక్ట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించడానికి అవసరమైన అన్ని ఫీచర్లూ వీటిలో ఉన్నాయి. వన్ ప్లస్ యూ-సిరీస్ టీవీలో 55 అంగుళాల 4కే ఎల్ఈడీ స్క్రీన్ ను అందించారు. డాల్బీ విజన్ హెచ్ డీఆర్ ఫార్మాట్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని స్పెసిఫికేషన్లన్నీ దాదాపు వన్ ప్లస్ టీవీ క్యూ1, క్యూ1 ప్రోల తరహాలోనే ఉన్నాయి.

అయితే వన్ ప్లస్ టీవీ క్యూ1 సిరీస్ లో క్యూఎల్ఈడీ డిస్ ప్లేలు అందుబాటులో ఉండగా ఇందులో ఎల్ఈడీ డిస్ ప్లేలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలన్నీ ఆండ్రాయిడ్ టీవీ 9 Pie ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ ప్లేస్టోర్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఉంది. గేమ్స్, యాప్స్ ను వీటి ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వై-సిరీస్ టీవీల్లో 20W సామర్థ్యమున్న డాల్బీ ఆడియో ట్యూనింగ్ సౌండ్ అవుట్ పుట్ ను అందించనున్నారు. యూ-సిరీస్ టీవీల్లో 30W 4-స్పీకర్ సెటప్ ను యిచ్చారు.

Tags :

Advertisement